Breaking News

చీపుర్లు పట్టారు.. శుభ్రం చేశారు…

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్వచ్ఛ గన్‌పూర్‌లో భాగంగా గ్రామంలో ఉన్న హై స్కూల్‌ నుండి తహసీల్‌ కార్యాలయం వరకు తారు రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళిని చీపుర్లతో తొలగించారు.

తార్‌ రోడ్డుపైన దుమ్ము ఉండడం వల్ల భారీ వాహనాలు వచ్చినప్పుడు లేచి అందరి కళ్ళల్లో పడుతుంది, అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా మట్టి ఉండడంతో అనేక సార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇది గమనించిన గ్రామస్తులు, యువకులు స్తానిక పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్చభారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకేముంది చీపుర్లు చేతబట్టి రోడ్డంతా శుభ్రం చేశారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article