Breaking News

రోడ్డు ప్రమాదంలో ఏఈఓ మతి

గాంధారి, డిసెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో లింగంపేట్‌ ఏఈఓ మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్‌ మండలంలో ఏఈఓగా పనిచేస్తున్న ఖలీల్‌ అహ్మద్‌ గురువారం సాయంత్రం గాంధారి మండలం చందా నాయక్‌ తండా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాద సమయంలో రోడ్డు పక్కన జేసీబీ సహాయంతో ఒక వ్యక్తి చెట్టును కూల్చివేయడానికి ప్రయత్నించడం, చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై పడడంతో దానిని తప్పుకోబోయి ఒక్కసారిగా ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డుపై చెట్టును కూల్చడమేనని స్థానికులు, తోటి ఏఈఓలు తెలిపారు. ఖలీల్‌ అహ్మద్‌ తలకు, ముక్కుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మతి చెందాడు. మతుడిది మొహమ్మద్‌ నగర్‌ మండల గనుగుల్‌ గ్రామం. అయితే మతుడు ఖలీల్‌ అహ్మద్‌కు ఈ నెల 20 వ తేదీన పెళ్లి కావలసి ఉంది.

Check Also

భారీగా ద్విచక్ర వాహనాలు స్వాధీనం

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, అదిలాబాద్‌ , నిర్మల్‌, కామారెడ్డి జిల్లాలో ద్విచక్ర ...

Comment on the article