Breaking News

జిల్లా స్థాయి గణిత పరీక్షకు 400 మంది ఎంపిక

కామారెడ్డి, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారుగా 2450 మంది విద్యార్థులు హాజరైనట్టు గణిత ప్రతిభా పరీక్షల కన్వీనర్‌ యం.సాయిలు పేర్కొన్నారు.

తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాడ్వాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇట్టి పరీక్షలకు అనుమతించిన జిల్లా విద్యశాఖాధికారికి కతజ్ఞతలు మరియు పరీక్ష నిర్వహణకు సహకరించిన మండల విద్యశాఖాధికారికి, ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు, అన్ని మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు మాట్లాడుతూ ప్రతి మండలం నుండి మీడియంకు ముగ్గురు చొప్పున నిజామాబాద్‌ నుండి 250 మంది విద్యార్థులు, కామారెడ్డి నుండి 150 మంది విద్యార్థులు జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు అర్హత సాధించారని జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌ శ్రీనివాస్‌ ప్రధాన కార్యదర్శులు కష్ణ అశోక్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని మండల బాధ్యులు, డివిజన్‌ బాధ్యులు, గణిత ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

15లోగా రుణాలు ఇవ్వాలి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి వ్యాపారుల‌కు ఆగస్టు 15 లోగా రుణాలు వంద ...

Comment on the article