ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసమానతలు లేని సమాజం కోసం రాజ్యాంగం ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించిందని ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌ అన్నారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో మంగళవారం మద్యాహ్నం మాక్లూర్‌ మండలం మదన్‌ పల్లి జడ్పి ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు.

కార్యక్రమానికి రవీందర్‌ ప్రధాన వక్తగా హాజరై విద్యార్తులనుద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకోవాలి గానీ దుర్వినియోగం చేయవద్దన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేలా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉద్బోదించారు. అందరికీ సమానహక్కులు కల్పిస్తూ సమానత్వపు హక్కును కూడా రాజ్యాంగం కల్పించిందన్నారు.

కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతల గంగాదాస్‌, జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు వసుధ, ఉపాద్యాయులు వీణా కుమారి, వేణుగోపాల్‌, జగదీశ్వర్‌, గణేష్‌ గౌడ్‌, లక్ష్మినారాయణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *