స్త్రీ నిధి రుణాలు సక్రమంగా మంజూరయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాల బలోపేతానికి మహిళల ఆర్థిక అభివద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాలు లక్ష్యానికి అనుగుణంగా మంజూరు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో డీఆర్‌డిఎ మెప్మా అధికారులతో, సిబ్బందితో స్త్రీ నిధిపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ నిధి కింద ఈ సంవత్సరం రూ.207 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.135 కోట్లు మంజూరు చేయవలసి ఉండగా కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు మాత్రమే మంజూరు చేశారని కారణాలు అడిగారు. మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందడానికి వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పథకాలకు అందించడానికి స్త్రీ నిధి పథకం అత్యంత ప్రధాన మైనదని, అవసరమైనదని కూడా తెలిపారు.

అయితే గత సంవత్సరాలలో రుణాల మంజూరు లోనూ, రుణాల వసూలు లోనూ మన జిల్లా పై స్థానంలో ఉండేదని, గత కొన్ని నెలల నుండి పడిపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో బ్యాంకు బ్రాంచ్‌ల అశ్రద్ధ ఏమైనా ఉంటే వాటి వివరాలు తెలపాలని, అదేవిధంగా రుణాల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని ఓవైపు పకడ్బందీగా రుణాల వసూలుకు చర్యలు తీసుకుంటూ మరోవైపు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు ఇప్పించడానికి అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.

వారానికోసారి ఈ విషయమై సమీక్షించుకొని ఎక్కడ సమస్య ఉందో అక్కడ దష్టి పెట్టి గ్యాప్‌ను సరి చేయాలన్నారు. వచ్చే జనవరి కల్లా ఈ విషయంలో అభివద్ధి కనబరచాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌డిఎ రమేష్‌ రాథోడ్‌, మెప్మా పిడి రాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *