ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకమైన పెద్ద రోడ్డు అయిన ఖిల్లా-గురుద్వారా-గోల్‌ హనుమాన్‌-పులాంగ్‌ రోడ్డును నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త ప్రత్యేక దష్టి సారించి బిటి రోడ్డుగా వేయించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్‌ రంగు అపర్ణ సీతారామ్‌ ఆధ్వర్యంలో నగరంలోని 24 వ డివిజన్‌ గాజులపెట్‌ గురుద్వారా దగ్గర ఎమ్మెల్యే చిత్రపటానికి స్థానిక ప్రజలు పాలాభిషేకం చేశారు.

నిజామాబాద్‌ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే గణేష్‌ గుప్తదేనన్నారు. కాలనీ వాసులందరూ గణేష్‌ గుప్తకు, మాజీ ఎంపి కవితకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రంగు సీతారామ్‌, అక్తర్‌, పద్మ, మాజీ కార్పొరేటర్‌ బాల్‌ కిషన్‌, దేవేందర్‌, రఘు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *