పేద రైతులకు కొత్త పాసుపుస్తకాలివ్వాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అక్కపూర్‌ గ్రామంలోని పేద రైతులకు చందన భూమి సర్వే నంబర్‌ 70, మరియు 22/ 1 లోని భూమి భూ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఆన్‌లైన్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా ఫారెస్ట్‌ భూమి పేరుతో గత సంవత్సరం నుండి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇందుకోసం కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని ఎంసిపిఐయు ఆధ్వర్యంలో మాచారెడ్డి తహసిల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, సహాయ కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా పైన పేర్కొన్న భూములు సాగు చేసుకుంటూ తాతల కాలం నుండి హక్కు పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఫారెస్ట్‌ భూమి పేరుతో రెవెన్యూ అధికారులు జాయింట్‌ సర్వే పేరుతో సంవత్సర కాలంగా నిర్లక్ష్యం చేశారని అన్నారు.

జాయింట్‌ సర్వే చేసి కూడా 45 రోజులు దాటి పోయిందని ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. తక్షణం రెవెన్యూ పరిధిలోని భూములకు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని, ఫారెస్ట్‌ భూములు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు దశాబ్దకాలం సాగులో ఉన్న రైతులకు ఫారెస్ట్‌ భూమి రెవెన్యూ భూమి కన్వర్ట్‌ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

గిరిజనేతరులకు మూడు దశాబ్దాలు సాగులో ఉంటే వారికి కూడా పట్టాలు ఇవ్వాలని ఉన్న అటవీ హక్కుల చట్టం అనుసరించి గత 50 సంవత్సరాలుగా సాగులో ఉన్న రైతులందరికీ పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తహసిల్దారు మాట్లాడుతూ రెవెన్యూ పరిధిలోని భూములకు 15 రోజుల్లో పాసుపుస్తకాలు ఇస్తామని, ఫారెస్ట్‌ భూమిలోని రైతులకు న్యాయం చేసేందుకు కలెక్టర్‌తో సంప్రదించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతులందరితో కలెక్టరేట్‌ ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగరాజు, రాములు, రాజయ్య, చంద్రయ్య, భూమయ్య, లక్ష్మి, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *