Breaking News

చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ

రెంజల్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుంకరి మోహన్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గోడప్రతులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 21 వరకు చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి మాలలు మాల ఉపకులాలు అధిక సంఖ్యలో తరలివచ్చి చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల మాల మహనాడు నాయకులు సునీల్‌, భూమేష్‌, సుధాకర్‌, వేణు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల‌ను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ...

Comment on the article