28 నుండి తెలంగాణ ఫుట్‌బాల్‌ ఉమెన్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉమెన్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ క్లబ్బులను తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పాల్గుణ ప్రకటించారు. ఈనెల 28 నుండి ప్రారంభం కానున్న ప్రథమ తెలంగాణ ఉమెన్స్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ క్లబ్బుల యజమానులకు జెర్సీలను అందజేసి లోగోని ఆవిష్కరించారు. అదే విధంగా టోర్నమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శిగా నరాల సుధాకర్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు.

ప్రముఖ న్యాయవాది, భాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఖలీల్‌లను టోర్నమెంట్‌ వైస్‌ చైర్మన్‌లుగా నియమించినట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఫల్గుణ మాట్లాడుతూ మొదటిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ మ్యాచ్‌లకు నిజామాబాద్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు.

ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన టోర్నమెంటును నిర్వహించడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. అన్ని మ్యాచ్లు నిజామాబాద్‌ నగరంలోని రాజారామ్‌ స్టేడియంలో 28 తేది నుండి వచ్చేనెల 4 తేదీ వరకు జరుగుతాయన్నారు. ఆరు క్లబ్బులను నిజామాబాద్‌లోని ప్రముఖులు కొనుగోలు చేసి క్లబ్బుల యొక్క బాధ్యతలను, క్లబ్బు నిర్వహణకు అయ్యే ఖర్చులన్నిటినీ క్లబ్బు యాజమాన్యాలు తీసుకోవడం సంతోషకరమన్నారు.

మొదటి క్లబ్బును డాక్టర్‌ కవితారెడ్డి డికెఆర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (డికెఆర్‌ఎఫ్‌సి) పేరుతో తీసుకున్నారని, రెండవ క్లబ్బుని నవ్య భారతి గ్లోబల్‌ స్కూల్‌ యజమాని సంతోష్‌ ఎన్జీఎన్‌ ఫుట్బాల్‌ క్లబ్‌ (ఎన్‌జిఎస్‌ఎఫ్‌సి) పేరుతో తీసుకున్నారని, మూడవ క్లబ్బుని హైదరాబాద్‌కు చెందిన అభినవ్‌ ఫ్రెండ్స్‌ వాపస్‌ డాగేస్‌ (విడిఎప్‌సి) పేరుతో తీసుకున్నారని, నాల్గవ క్లబ్బును వసుంధర పాఠశాల యాజమాన్యం మాలు వసుంధర ఫుట్‌బాల్‌ క్లబ్‌ (విఎఫ్‌సి) పేరుతో తీసుకున్నారని, అయిదవ క్లబ్బుని ఎస్సార్‌ యజమాని మారయ్య గౌడ్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌సి) పేరుతో తీసుకున్నారని, అదే విధంగా చివరిదైన కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ యొక్క ఫుట్‌బాల్‌ క్లబ్బుకు (సిఎఫ్‌ఏఎఫ్‌సి) తమ వంతు సహాయం ఉంటుందని కాకతీయ యాజమాని రాజు చెప్పడంతో ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఫల్గుణతో పాటు నరాల సుధాకర్‌, రాజేందర్‌ రెడ్డి, షకీల్‌, ఖలీల్‌, గొట్టిపాటి నాగరాజు, అంద్యాల లింగం, ఎస్జిఎఫ్‌ సెక్రెటరీ అబ్బాయి మోహన్‌, సాయగౌడ్‌, సుబ్బారావు వాహిద్‌, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు. వారితో పాటుగా క్లబ్బుల యజమానులు డికెఆర్‌ డాక్టర్‌ కవితారెడ్డి, డాక్టర్‌ మారయ్యగౌడ్‌, సంతోష్‌ కుమార్‌, రాజ, అభినవ్‌ లక్ష్మీరాజ్యం, వసుధ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article