Breaking News

Daily Archives: January 4, 2020

వృద్దాప్యం ఒక మజిలీ

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌లో సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సమావేశానికి పున్న రాజేశ్వర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అభివద్ధి చెందాలని అన్నారు. ఇందులోని సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించాలని కోరారు. సీనియర్‌ సిటిజెన్స్‌ ఆరోగ్యంగా ఉండే విధంగా వాకింగ్‌ యోగ మరియు ధ్యానం చేయాలని సూచించారు. వద్ధాప్యం ఒక మజిలీ అని, ప్రతివారు కోరుకున్న కోరుకోక పోయిన చేరుకునేది మజిలీ అన్నారు. ...

Read More »

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య సంఘం జిల్లా అధ్యక్షులు జబ్బర్‌ నాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందన్నారు. 119 గురుకులాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఒక్క గురుకులాల్లో కూడా సరైన సౌకర్యాలు, వసతులు కల్పించలేదన్నారు. దీంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని, ...

Read More »

8న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా ఈనెల 8వ తేదీన దేశంలోని అన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికులు భాగస్వాములు కావాలని ఏఐసిటియు అనుబంధ ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్థానిక నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాలతో నిర్మాణ రంగంలోకి 100 ...

Read More »

ఆ స్థలాన్ని కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌ చౌరస్తా వద్ద గల మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని, రిలయన్స్‌ సూపర్‌ స్టోర్‌ యాజమాన్యం అక్రమంగా, తమ వ్యాపార అవసరాల కోసం, పార్కింగ్‌ కోసం వాడుకోవడాన్ని నిరసిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే స్థలాన్ని కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిఎల్‌ఎఫ్‌, జేఏసీ, సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదవాళ్లు నివాస స్థలం లేక ఖాళీగా,నిరుపయోగంగా ఉన్న ...

Read More »

ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేషెంట్లు ఆసుపత్రికి వచ్చే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన వర్ని మండలం మల్లారం గ్రామంలో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. వర్ని కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అన్ని విభాగాలు పరిశీలించి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంచి భవనం, సదుపాయాలు ఉన్నాయి కానీ ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత బాగా లేవన్నారు. ఆసుపత్రికి ...

Read More »

సిఏఏలో ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించాలి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి రాజారెడ్డి గార్డెన్‌లో సిఏఏ, ఎన్‌ఆర్‌సి పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచెంద్ర రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు అల్జాపూర్‌ శ్రీనివాస్‌ హాజరయ్యారు. సిఏఏపై కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు. సిఏఏ భారతదేశంలో జీవిస్తున్న ముస్లిములకు ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అలాగే సిఏఏలో వున్న వాస్తవాలను గ్రామీణ ప్రజల వరకు ...

Read More »

శనగ పంటను పరిశీలించిన వ్యవసాయాధికారి

రెంజల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బొర్గం గ్రామంలో వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి, విస్తీర్ణ అధికారి అజయ్‌ క్షేత్రస్థాయిలో శనగ పంటను పరిశీలించారు. శనగ పంటకు అగ్గి తెగులు సోకిందని ఆయన రైతులకు సూచించారు. దీని నివారణకై కార్బన్డిజామ్‌ 250 గ్రాములు లేదా ధమోపినెట్‌ మితీల్‌ 300 గ్రాములు, బెంజోయేట్‌ 100 గ్రాములు నీటిలో పిచికారి చేసినట్లయితే తెగులు నివారించవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రెంజల్‌ సింగిల్‌విండో చైర్మన్‌ మొయినుద్దీన్‌, రైతులు జల్దా లింగన్న, జబ్బర్‌, ...

Read More »

ఎన్నికలలో ప్రతి విభాగము కీలకమైనదే

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో ఏ విషయాన్ని కూడా తక్కువగా అంచనా వేయవద్దని, ప్రతి భాగము కీలకమైనదేనని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పోలీస్‌ రెవెన్యూ మున్సిపల్‌ తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితా శనివారంతో ఫైనల్‌ ప్రింటింగ్‌ పూర్తయిందని 5వ తేదీన రిజర్వేషన్లు పూర్తవుతాయని తెలిపారు. తద్వారా సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ ...

Read More »

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాత్రి రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన కట్ల నవీన్‌ (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్‌ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా గత కొంతకాలంగా అతను పని చేయకుండా, మద్యానికి బానిసై అప్పులు పెరగడం వల్ల ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read More »

ధూపల్లిలో మొక్కలు నాటిన సర్పంచ్‌

రెంజల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ సాయరెడ్డి ప్రధాన రోడ్డుకు ఇరుపక్కల మొక్కలు నాటారు. పల్లె ప్రగతిలో భాగంగా 500 మొక్కలను నాటడం జరిగిందని ఆయన తెలిపారు. మొక్కల సంరక్షణకై జిపి ఫండ్స్‌ ద్వారా ట్రీ గాడ్స్‌ తెప్పించామన్నారు. నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు ట్రీ గాడ్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్‌ సాయిలు, గ్రామ అధ్యక్షులు బాబన్న, స్థానిక నాయకులు సత్యనారాయణ, గంగారెడ్డి, కారోబార్‌ కిరణ్‌ ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి అనుబంధ సివిల్‌ సప్లయ్‌ హమాలిస్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌,దశరథ్‌, రాజు అన్నారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి గోదాం వద్ద సమ్మెకు సంబంధించిన గోడప్రతులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కనీస వేతనం నెలకు 21,000 ఇవ్వాలని, అంతే కాకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని వారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ...

Read More »

పల్లె ప్రగతి పనులను సమీక్షించిన మండల ప్రత్యేక అధికారి

రెంజల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్న గుట్ట తండా, కునేపల్లి, దండి గుట్ట, బాగేపల్లి గ్రామాలలోని డంపింగ్‌ యార్డ్‌ పనులను మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌ పరిశీలించారు. పదిరోజుల అభివద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో అభివద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత, డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటిక పనులపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రణాళికలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ...

Read More »

5న ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపేన్‌

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 ఆదివారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాలలో బిఎల్‌వోలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదుకు, మార్పులు చేర్పులకు బిఎల్‌వోల వద్ద సంబంధిత ఫారాలు తీసుకొని అన్ని ...

Read More »