Breaking News

వైకుంఠ ధామాల నిర్మాణాలకు భూమిపూజ

మాక్లూర్‌, జనవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని వెంకటాపూర్‌, గొట్టుముక్కుల, ముల్లంగి, మాదాపూర్‌, చిన్నాపూర్‌ గ్రామాలలో గురువారం జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో నిజామాబాదు జెడ్పి చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్మించనున్న వైకుంఠ ధామాల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజలు చేశారు. బొంకన్‌పల్లిలో చెత్త బుట్టలను పంపిణి చేశారు. ఎంపీడీఓ, సర్పంచులు, తెరాస నాయకులు గోపాల్‌ నగేష్‌, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ ...

Comment on the article