Breaking News

బీసీలు ఐక్యంగా పోరాడాలి

జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మోర్తాడ్‌లోని ప్రజానిలయంలో బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్‌ జిల్లా క్యాలెండర్‌ను బహుజన సమాజ్‌ వాదీ పార్టీ నాయకులు ముత్యాల సునీల్‌ కుమార్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్‌, బీసీ హక్కులకోసం పోరాడాలాన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ అమలు చేయాలని, అప్పుడే బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీ ద్యాగ శేఖర్‌, బీసీ విద్యార్థి సంఘం నాయకులు రాము, మధు, తరుణ్‌, నిశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర ...

Comment on the article