Breaking News

భీమ్‌గల్‌ అభివృద్ది కోసం ఓటు వేయాలి

భీమ్‌గల్‌, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 1,2,8,10 వార్డుల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అనంగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలన్నారు.

కేసీఆర్‌ కోసం, తన కోసం జరుగుతున్న ఎన్నికలు కావని భీంగల్‌ మున్సిపాలిటీ అభివద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు. భీంగల్‌ పట్టణంలో ఇంటింటికి నల్లా ద్వారా త్రాగునీరు అందించి తెరాస ప్రభుత్వం ఆడబిడ్డల కష్టాలు తీర్చిందన్నారు. నీళ్లు ఇచ్చిన, రోడ్లు వేసిన టిఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి కోరారు.

గల్లీలు పుట్టినప్పటి నుండి సమస్యలు చూడని కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు ఇవాళ ఓటు కోసం వస్తే వాళ్లకు ఎందుకు వేయాలో ఆలోచించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, వద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, వికలాంగులకు 3016 రూపాయల ఫించన్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article