Breaking News

కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ విస్తృత ప్రచారం

కామారెడ్డి, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శనివారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ 3, 4, 5, 28, 26, 29, 30, 31, 45, 46, 47 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని, యువతకు నిరుద్యోగ భతి ఇస్తానని ఎగ్గొట్టిన ప్రభుత్వం తెరాస అన్నారు.

కేజీ నుండి పిజి అన్నారు కానీ ఉన్న స్కూళ్ళే మూసి వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంటింటికీ నల్ల ఇస్తా, ఇవ్వకుంటే ఓటు అడగడానికి కూడా రానన్నాడు, ఇలాంటి అబద్దాలకోరు రెండు పడక గదుల ఇళ్ళు ఇస్తానంటే నమ్మకండని ఓటర్లకు తెలిపారు. కెసిఆర్‌ అడ్రస్‌ ప్రగతి భవన్‌ నుండి ఫాంహౌస్‌ వరకేనని, సెక్రటరియేట్‌కు రాడు ప్రజల సమస్యలు తెలుసుకోడని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో అభివద్ధి శూన్యమని, కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ పూర్తిగా అవినీతి మయమైందని షబ్బీర్‌ అలీ అన్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్‌ కౌన్సిలర్‌ లకు లంచం ఇవ్వనిదే పని ప్రారంభం కావడం లేదన్నారు.

ఎంతో కష్టపడి తాను నీళ్ళు తీసుకు వస్తే నల్ల ఇవ్వడానికి ప్రతి ఇంటి నుండి రెండు వేల రూపాయలు లంచం అడుగుతున్నారని షబ్బీర్‌ తెలిపారు. అవినీతి పరులను గెలిపించుకుంటే ఆగమాగమైపోతామని చెప్పారు. 100 గజాలు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు. ఎటు పోయింది మీ పథకం అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలనను తాను ముందు వుండి నడిపిస్తానన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌లో గెలిస్తే మొదటి తీర్మానం చిన్నచిన్న వ్యాపారస్తులకు తయ్‌ బజార్‌ టాక్స్‌ రద్దు చేస్తామన్నారు. మున్సిపల్‌లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం రద్దు అవుతుంది, అది రద్దు కాకుండా పోరాడుతామన్నారు. ప్రచారంలో షబ్బీర్‌ అలీతో పాటు డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు, ఎంజి గోపాల్‌ గౌడ్‌, ఫిరంగి రాజేశ్వర్‌, దాత్రికా సత్యం, అన్వర్‌, మీర్‌, ఇంత్యాజ్‌ అలీ, మహమద్‌ సిరాజ్‌, పండ్ల రాజు, పంపరి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *