Breaking News

మీ వెనకాల నేనుంటా

నిజామాబాద్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేయడానికి మీ వెనకాల నేను ఉంటానని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అధికారులను ప్రోత్సహించారు. సోమవారం సాయంత్రం జిల్లా అధికారుల కన్వర్జెన్స్‌ మీటింగ్‌ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలలో అన్ని విధాలా అధికారులను ప్రోత్సహిస్తూ ప్రశాంతంగా నిర్వహించడానికి వెనక ఉండి నడిపించిన కలెక్టర్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ అధికారుల సమక్షంలో సన్మానించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టరని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తాను మీ వెంట ఉంటానని తెలిపారు. జిల్లాలో గత ఒకటిన్నర సంవత్సరంగా ఎన్నికల విధులలో ఉన్నందున కమిషనర్లు, జిల్లా అధికారులు బాగా పని చేశారని అందుకుగాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలు కార్యక్రమాలపై శ్రద్ధ వహించడానికి అవకాశం ఏర్పడిందన్నారు.

మంచి టీం ఉన్నదని స్ఫూర్తి వంతంగా అందరూ కలిసి ముందుకు వెళితే అన్ని పనులను కూడా లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయడానికి అవకాశముందన్నారు. కిందిస్థాయి అధికారులతో స్నేహపూర్వకంగా మసలు కోవడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయని సూచించారు. సన్మాన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *