Breaking News

ఎల్‌ఐసి రెండోరోజు నిరసన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఎల్‌ఐసి బ్రాంచ్‌ ఆఫీసులో రెండవ రోజు నిరసనల జోరు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి వాటాలను స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడం తగదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఏజెంట్లు, ఉద్యోగులు నిరసన తెలిపారు.

64 సంవత్సరాలను నుండి ఇన్సూరెన్స్‌ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థగా పేరుపొందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి వాటాలను ప్రైవేటు వాళ్ళకి అమ్మటం, స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడం దారుణమని, దేశవ్యాప్తంగా బుధవారం 12 గంటల నుండి 2 గంటల వరకు పెద్ద మొత్తంలో నిరసనలు చేపట్టారు.

దేశం మొత్తంలో 13 లక్షలకు పైగా ఏజెంట్లు లక్షకుపైగా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న సంస్థను స్టాక్‌ మార్కెట్‌కు ధారాదత్తం చేయడం తగదని వారు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇందులో ఆర్మూరు బ్రాంచ్‌ లియాఫీ అధ్యక్షులు పూల శ్రీనివాస్‌, కార్యదర్శి బాలయ్య, శరత్‌, గణేష్‌, సాయన్న, ముత్యం, శంకర్‌, చందర్‌, చేపూర్‌ శ్రీనివాస్‌, ఏజెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

ఆత్యవసరమైతేనే బ్యాంక్‌ల‌కు రండి

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసమైతేనె బ్యాంక్‌ల‌కు రావాల‌ని ఆంధ్రబ్యాంక్‌ మేనేజర్‌ బన్సీ లాల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *