Breaking News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌లను ఆర్మూర్‌ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ గులాబీ జెండాను కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్మూర్‌ మునిసిపల్‌ నూతనంగా ఎన్నికైన చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌లను ఆర్మూర్‌ జర్నలిస్టులు బుధవారం శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్‌ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల గురించి నూతన చైర్‌ పర్సన్‌కు వివరించారు. అదేవిధంగా జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో ఆరోగ్యం పట్ల చింతిస్తున్నట్లు వారికి హెల్త్‌ కార్డులను ప్రభుత్వం ద్వారా అందే విధంగా చూడాలని కోరారు. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు రెండు పడక గదుల ఇళ్ళు కల్పించే విధంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత ప్రభుత్వం ద్వారా సహకరించాలని విన్నవించారు.

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి ఎన్నో మార్లు వివరించడం జరిగిందని వారికి ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్ట్‌ల సమస్యలు విన్న చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత స్థానిక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డితో మాట్లాడి తగు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

అలాగే ఆమెను సన్మానించిన జర్నలిస్టులకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పొన్నాల చంద్రశేఖర్‌ బొడ్డు గోపి, విన్సెంట్‌ స్వామి, నాగభూషణ్‌, నరేందర్‌, చట్టం శీను, గోలి పురుషోత్తం, సమ మురళి, రాజ్‌ కుమార్‌, ప్రసాద్‌, అజీమ్‌, రాజేందర్‌ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article