Breaking News

Daily Archives: February 17, 2020

బిసి కులాల‌ జనగణన చేపట్టాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్‌ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు బీసీ కులాల‌ జనగణన వెంటనే చేపట్టాని, బీసీ రిజర్వేషన్లు జనాభాకు అనుగుణంగా పెంచాల‌నిల వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంబిసి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ రాష్ట్రంలోని కేసీఆర్‌ సర్కార్‌ బీసీ యొక్క రిజర్వేషన్లు జనాభాకు అనుగుణంగా చేపట్టకుండా బిసి కులాల‌ ప్రజల‌కు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్లు ఇస్తున్నామని ...

Read More »

నిరుపేదల‌ను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 12 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 9 ల‌క్షల 45 వేల‌ 500 రూపాయల చెక్కుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల 32 ల‌క్ష రూపాయల‌ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అనారోగ్య సమస్యల‌తో ఆసుపత్రుల‌ పాలైన నిరుపేదల‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బు ఇవ్వడం ...

Read More »

ఘనంగా సిఎం జన్మదినోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు 66వ జన్మదినం సందర్భంగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రం, దేవునిపల్లి శివారులో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ ఛైర్మన్‌ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్‌ రెడ్డి, కౌన్సిల‌ర్‌లు, జిల్లా ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దార్శనికుడు, బంగారు తెలంగాణ నిర్మాణ ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల‌ను మండలంలో అధికారులు , ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాల‌యాల‌తో పాటు పంచాయతీ కార్యాల‌యాల‌లో అధికారులు మొక్కలు నాటారు. తహశీల్దార్‌ కార్యాయంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, పంచాయతీ కార్యాల‌యంలో సర్పంచ్‌ సాయరెడ్డి మొక్కలు నాటారు. రెంజల్‌ మండల‌ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టి.ఆర్‌.యస్‌ నాయకులు ముఖ్యమంత్రి 66 వ జన్మదిన వేడుకల‌ను ...

Read More »

ప్రతి వార్డుకు సీనియర్‌ అధికారి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనె 24 నుండి నిర్వహించబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డుకు ఒక సీనియర్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియమించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా అధికారుల‌తో కన్వర్జెన్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం మున్సిపాలిటీలో, నగర పాల‌క సంస్థలో ప్రతి వార్డు లేదా డివిజన్‌కు ఓ సీనియర్‌ అధికారిని నియమించి అతనికి ఆ వార్డుకు ...

Read More »

రెంజల్‌, నీలా సొసైటీలు టిఆర్‌ఎస్‌ కైవసం

రెంజల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో ఆదివారం వాయిదా పడిన రెంజల్‌, నీల‌ సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల‌ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నిర్ణిత సమయానికి చేరుకున్న డైరెక్టర్‌లు ముందుగానే నిర్ణయించుకున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల‌కు అభ్యర్థుల‌ నామినేషన్లను దాఖలు చేశారు. రెండు విండోల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల‌కు పోటీ ఏర్పడడంతో ఎన్నికల అధికారులు మద్యాహ్నం రెండు గంటల‌కు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. rbt రెంజల్‌ చైర్మెన్‌గా తెరాస మద్దత్తు దారుడు ...

Read More »

ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికగా భావించి ఎంతో ప్రాముఖ్యతతో హరిత హారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మాక్లూర్‌ ఎంపీడీవో కార్యాల‌య ఆవరణలో రూపా నివాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల‌కు మొక్కలు, పరీక్ష ప్యాడ్స్‌, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లు ఎంత ముఖ్యమో ఆ ప్రాముఖ్యాన్ని ...

Read More »

ఏఐసిటియు ధర్నా

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఐక్య బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐసీటీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్మాణ రంగ కార్మికుల‌ కోసం నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ఏఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లేబర్‌ అధికారులు కార్మిక సమస్యల‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు సెస్సు వసూలు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామ కమిటీ మండల కమిటీల‌ను విలువ చేయకుండా సంక్షేమ పథకాల‌ కోసం కార్మికుడు ...

Read More »

ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర రావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాల‌ని ప్రాజెక్టు గణపతి ఆల‌యం వద్ద జిల్లా పరిషత్‌ జడ్పీ చైర్పర్సన్‌ ధపెదర్‌ శోభ రాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిజాంసాగర్ మండ‌లంలోని అచ్చంపేట్‌ గురుకుల‌ పాఠశాల‌లో ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ ధపెదర్‌ శోభ రాజు కేకు కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, ...

Read More »

ఘనంగా జననేత పుట్టినరోజు సంబరాలు

బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల్లో టి.ఆర్‌.ఎస్‌ యువనాయకుడు దేశాయిపేట్‌ పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. టి.ఆర్‌.ఎస్‌ పార్టీ కార్యాల‌యంలో స్థానిక నాయకుల‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటి రోగుల‌కు పళ్ళు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మినీ స్టేడియంలో, బీడీ కార్మికుల కాల‌నీలో మొక్కలు నాటి నీరుపోశారు. తరువాత బాన్సువాడ పట్టణంలో రిల‌యన్స్‌ ట్రెండ్‌ ...

Read More »

జనాభా లెక్కల్లో బిసి గణన చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేమెంతో మాకు అంతే వాటా కావాలంటే మా జనాభా ఎంతో తెలవాలి అనే నినాదంతో సోమవారం ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌కు బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. బ్రిటిష్ కాలంలో చేసిన బిసి గణన తప్పితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బిసి గణన చేయకపోవడం అన్యాయమని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల‌ సుధాకర్‌ అన్నారు. ఈ సారి జనాభా లెక్కల్లో ఎన్నో కొత్త అంశాల‌ను ఎన్నో వస్తువుల‌ ...

Read More »

సిఏఏకి వ్యతిరేకంగా సంతకాల‌ సేకరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నార్సీ , సిఎఎ, ఎన్‌పిఆర్‌ చట్టాల‌ను వ్యతిరేకిస్తూ సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బోధన్‌ బస్టాండ్‌లో సంతకాలు సేకరించారు. సిఎఎ, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌ చట్టాల వ్యతిరేక కూటమి ఆద్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సిఎఎను వ్యతిరేకిస్తూ క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసిన కేసీఆర్‌ సర్కార్‌కు ఈ సందర్భంగా కూటమి నేతలు గొర్రెపాటి మాధవరావు, దండి వెంకట్‌ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో, స్థానిక సంస్థల్లో కూడా తీర్మానం చేయాల‌ని కోరారు.

Read More »

మొక్కలు నాటిన కలెక్టర్‌, జిల్లా అధికారులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పిలుపుమేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, బిఎస్ ల‌త కలెక్టరేట్‌లో సోమవారం మొక్కలు నాటి నీరు పోశారు. ట్రీ గార్డ్‌లు అమర్చారు.

Read More »

ముఖ్యమంత్రి ఆశయాల‌కు అనుగుణంగా ముందుకు వెళ్దాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆకుపచ్చ తెలంగాణకు అహర్నిశలు పాటు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సంఖ్యలో మొక్కల‌ను నాటి ఆయనకు అండగా నిలుద్దామని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు పిుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నాగారంలోని బాలుర మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల‌ ఆవరణలో జిల్లా కలెక్టర్‌తో కలిసి సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ...

Read More »

వేముల‌వాడకు హెలికాప్టర్ సేవ‌లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేముల‌వాడ, సిరిసిల్లా జిల్లాలోని వేముల‌వాడ రాజన్న ఆల‌యంలో మహా శివరాత్రి వేడుకల‌ను వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. జాతరకు కోటి రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వేముల‌వాడకు హెలికాప్టర్‌ ప్యాకేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్ల‌డిరచారు. మధ్యమానేరు ఏరియల్‌ వ్యూ కూడా ప్యాకేజీలో జోడిరచాల‌ని అధికారుల‌కు సూచించారు. పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి బస్సు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆల‌యంలో ఏర్పాట్లపై వివిధ శాఖల‌ అధికారుల‌తో ...

Read More »

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకలు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తల‌తో కలిసి గణేష్‌ బిగాల‌ కేక్‌ కట్‌ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు పక్కన తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తల‌తో కలిసి మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర రథ ...

Read More »