Breaking News

Daily Archives: February 19, 2020

గల్ఫ్‌లో లింగాపూర్‌ వాసి మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పు తీర్చేందుకు బతుకుదెరువు కోసం బయట దేశం వెళ్ళిన శంకరయ్య అక్కడే గుండెపోటుకు గురై మృతి చెందాడు. లింగాపూర్‌ గ్రామస్తుల‌ కథనం ప్రకారం… లింగాపూర్‌కు చెందిన వడ్ల శంకరయ్య (58) గత 20 ఏళ్లుగా గల్ప్‌ దేశానికి వెళ్తున్నాడని, శనివారం తన గదిలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు కృషి చేయాల‌ని లింగాపూర్‌ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లింగాపూర్‌ వడ్ల శంకరయ్య / ...

Read More »

నిఘానేత్రాల‌ను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేద్రంతో పాటు, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాలాల్లో, తండాలాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన నిఘా నేత్రాల‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా ఎస్పీ యన్‌.శ్వేతా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడి ్డ(రథాల‌ రామారెడ్డి) మండల‌ కేంద్రంలోని కామారెడ్డి – భీంగల్‌ దారిలో గల‌ పొలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల‌ మైదానంలో ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాల‌ను ...

Read More »

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి భజరంగ్‌దళ్‌ అధ్వర్యంలో ఛత్రపతి శివాజి మహరాజ్‌ 393 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వీక్లీ మార్కెట్‌ నుండి మొదలుకొని పోట్టిశ్రీరాములు విగ్రహం నుంచి జెపిన్‌ విగ్రహం నుండి సుభాష్‌ విగ్రహం మీదుగా ధర్మశాల‌, ర్కెల్వేస్టేషన్‌ రోడ్డు గుండా క్రోత్త బస్టాండ్‌ నుండి శివాజి విగ్రహం వరకు చేరుకోని అనంతరం శివాజీ విగ్రహనికి పూల‌మాల‌ సమర్పించారు. అక్కడినుండి రాధాక్రిష్ణ లాడ్జీ మీదుగా జన్మభూమి రోడ్డు గుండా దేవునిపల్లి శివాజీ విగ్రహనికి పూల‌మాల‌ సమర్పించి ...

Read More »

ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాల‌ కోసం, విద్యారంగాన్ని బాగుచేయడం కోసమే జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల‌ చేయాల‌ని, నిరుద్యోగ భృతి అమలు చేయాల‌ని పిడిఎస్‌యు, పివైఎల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఉపాధి క‌ల్ప‌న కార్యాల‌యం ముందు బుదవారం ధర్నా చేశారు. ఈ ...

Read More »

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల‌ చేయాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల‌ చేసి నిరుద్యోగుల‌ ఆత్మహత్యను నివారించాల‌ని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాల‌న్నారు. పిడిఎస్‌యు నిజామాబాద్‌ జిల్లా కమిటీ సమావేశం బుదవారం ఆర్మూర్‌లో జరిగింది. సమావేశానికి శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు. పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న‌, కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌, ...

Read More »

స్నేహ సొసైటీకి సేవ ధార్మిక జాతీయ పురస్కారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని స్నేహ సొసైటీకి సేవ ధార్మిక జాతీయ పురస్కారం ల‌భించినట్లు సొసైటీ కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాదుకు చెందిన ల‌తా రాజా ఫౌండేషన్‌ వారు అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల‌ 22వ తేదీన నగరంలోని ల‌క్ష్మీ కళ్యాణ మండపంలో అవార్డును ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ల‌తా రాజా ఫౌండేషన్‌ నుండి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. స్నేహతో పాటు మామిడిపూడి వెంకటరంగయ్య ...

Read More »

గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ అందజేత

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్ మండలం వెల్గ‌నూర్‌ గ్రామ పంచాయతీకి నూతన ట్రాక్టర్‌ను మండల‌ సర్పంచ్‌ల‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి టాక్టర్‌ను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని ప్రజలు చెత్తను ట్రాక్టర్‌లో వేసిన తర్వాత డంపింగ్‌ యాడ్‌కు తరలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌, ఎంపీటీసీ జనార్ధన్‌, మాగి సర్పంచ్‌ కమ్మరి కత్త ఆంజయ్య, నాయకులు ...

Read More »

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల‌ మండల అధ్యక్షులుగా సీఎచ్‌ రమేష్‌ కుమార్‌-మనతెలంగాణ, ఉపాధ్యక్షులుగా మంగపాల్‌ దినాకర్‌-10టీవి, జెనరల్‌ సెక్రెటరీగా సయ్యద్‌ మెహ్రాజ్‌ ఒద్దిన్‌-ఎన్‌ టీవి, జాయింట్‌ సెక్రెటరీగా మొహమ్మద్‌ షరీఫ్‌-ఆంధ్రభూమి, కోశాధికారిగా సీహెచ్‌ కాశి -ఐఎన్‌ బి టివి, కార్యవర్గ సభ్యులుగా సంజీవ్‌, ల‌క్ష్మణ్‌ దాస్‌, హుల్లాస్‌, రాజమ్లయ్య, అబ్దుల్‌ రహీం, రఘు గౌడ్‌ నియమించబడ్డారు.

Read More »

నీటి సమస్య తీరింది

బీర్కూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని పోచారం కాల‌నీకి నీటి కష్టాలు తొల‌గిపోయాయి. బుధవారం సింగిల్‌ ఫేస్‌ మోటర్‌ వేసి కాల‌నీ వాసుల‌కు సర్పంచ్‌ కుమారి ఆవారి స్వప్న గంగారం, ఉపసర్పంచ్‌ షాహినా బేగరు నీటి కొరతను తీర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల‌నీలో వేసవికాలం దృష్ట్యా నీటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. కాల‌నీవాసుల‌ నీటి సమస్య తీర్చిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు మన్నన్‌ శంకర్‌ ...

Read More »

హసన్‌ పల్లి రోడ్డు సొగసుచూడత‌రమా

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామానికి వెళ్లే బిటి రోడ్డుకు అడుగడుగునా గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హసన్‌ పల్లి గ్రామం మీదుగా హెడ్్స‌లూస్ జల‌విద్యుత్‌ కేంద్రానికి వెళ్లేందుకు ఈ రహదారి గుండానే వెళుతుంటారు. జల‌విద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా వున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్లను పరిశీలించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ రహదారి గుండా వెళుతుంటారు. చాలా సంవత్సరాల‌ తరువాత వేసిన బీటీ రోడ్డు గుంతల‌మయంగా ...

Read More »

రైతుకు సేవచేసే భాగ్యం కలిగింది

గాంధారి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు సేవచేసే భాగ్యం కల‌గడం అదృష్టంగా భావిస్తున్నట్లు ముదెల్లి సహకార సంఘం నూతన చైర్మన్‌ సజ్జనపల్లి సాయిరాం అన్నారు. ఇటీవల‌ జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాల‌కవర్గం బుధవారం రైతుల‌ సమక్షంలో కొలువుదీరింది. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ సాయిరాం, వైస్‌ చైర్మన్‌ బన్సీలాల్‌ భాద్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌, కార్యదర్శి కృష్ణారెడ్డి అయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం చైర్మన్‌ సాయిరాం మాట్లాడుతూ కేవలం సహకార సంఘం ...

Read More »