Breaking News

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

కామారెడ్డి, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి భజరంగ్‌దళ్‌ అధ్వర్యంలో ఛత్రపతి శివాజి మహరాజ్‌ 393 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వీక్లీ మార్కెట్‌ నుండి మొదలుకొని పోట్టిశ్రీరాములు విగ్రహం నుంచి జెపిన్‌ విగ్రహం నుండి సుభాష్‌ విగ్రహం మీదుగా ధర్మశాల‌, ర్కెల్వేస్టేషన్‌ రోడ్డు గుండా క్రోత్త బస్టాండ్‌ నుండి శివాజి విగ్రహం వరకు చేరుకోని అనంతరం శివాజీ విగ్రహనికి పూల‌మాల‌ సమర్పించారు.

అక్కడినుండి రాధాక్రిష్ణ లాడ్జీ మీదుగా జన్మభూమి రోడ్డు గుండా దేవునిపల్లి శివాజీ విగ్రహనికి పూల‌మాల‌ సమర్పించి జయంతిని నిర్వహించారు. కార్యక్రామంలో భజరంగ్‌ దళ్‌ జిల్లాప్రముఖ్‌ మాట్లడుతూ యువత చెడు దారిన వెళ్ళకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల‌ జయంతుల‌ను చేయాల‌న్నారు.

హిందూ ధర్మాన్ని, దేశాన్ని కాపాడిన వీరుడు ఛత్రపతి శివాజి మహరాజ్‌ జయంతిని ఘనంగా జరుపుకోవాల‌ని, ప్రతి యువకుడు దేశం కోసం, ధర్మం కోసం పని చేయాల‌ని, మతమార్పిడి, ల‌వ్‌ జిహద్‌ నుండి హిందూ ధర్మాన్ని కాపాడాల‌ని కోరారు. కార్యక్రమంలో పాపిరెడ్డి, శ్రీనివాస్‌, రవి, నవీన్‌, అమర్‌, నరేష్‌, రాజు, సాయి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ -19 ఆసుపత్రిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చటానికి చర్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *