Breaking News

గల్ఫ్‌లో లింగాపూర్‌ వాసి మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పు తీర్చేందుకు బతుకుదెరువు కోసం బయట దేశం వెళ్ళిన శంకరయ్య అక్కడే గుండెపోటుకు గురై మృతి చెందాడు. లింగాపూర్‌ గ్రామస్తుల‌ కథనం ప్రకారం… లింగాపూర్‌కు చెందిన వడ్ల శంకరయ్య (58) గత 20 ఏళ్లుగా గల్ప్‌ దేశానికి వెళ్తున్నాడని, శనివారం తన గదిలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు.

మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు కృషి చేయాల‌ని లింగాపూర్‌ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లింగాపూర్‌ వడ్ల శంకరయ్య / భార్య అమృత, నలుగురు కూతుళ్లు వడ్ల భాగ్యల‌క్ష్మి, సుమల‌త, కవిత, అనూష ఉన్నారు. సుమారు ఐదు ల‌క్షల‌ వరకు బాకీ ఉందని తెలిపారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు బోరున విల‌పిస్తున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా శంకరయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించాల‌ని కోరుతున్నారు.

Check Also

కోవిడ్‌ -19 ఆసుపత్రిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చటానికి చర్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *