Breaking News

స్నేహ సొసైటీకి సేవ ధార్మిక జాతీయ పురస్కారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని స్నేహ సొసైటీకి సేవ ధార్మిక జాతీయ పురస్కారం ల‌భించినట్లు సొసైటీ కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాదుకు చెందిన ల‌తా రాజా ఫౌండేషన్‌ వారు అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల‌ 22వ తేదీన నగరంలోని ల‌క్ష్మీ కళ్యాణ మండపంలో అవార్డును ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకమైన ల‌తా రాజా ఫౌండేషన్‌ నుండి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. స్నేహతో పాటు మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌ హైదరాబాద్‌, కేరళ రాష్ట్రానికి చెందిన సత్వఎన్విరాన్మెంటల్‌ ఆర్గనైజేషన్‌, ల‌క్నోకి చెందిన మనీషా మందిరాకు సేవా ధార్మిక జాతీయ అవార్డు ఇవ్వనున్నారు. అవార్డు కింద 50 వేల‌ రూపాయల‌ నగదు, జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు.

ఈ కార్యక్రమం ఈ సంవత్సరం నిజామాబాద్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. మాజీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, ఐఏఎస్‌ అధికారి పార్థసారథి, శాంతా బయోటెక్‌ చైర్మన్‌ డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి, జిల్లా జడ్జి గౌతమ్‌ ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, భరత్‌ భూషణ్‌, సాంస్క ృతిక వ్యవహారాల‌ డైరెక్టర్‌ మామిడి హరిక ృష్ణ, ఫౌండేషన్‌కు చెందిన కేకే రాజా, తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.

పాత్రికేయుల‌ సమావేశంలో సిద్దయ్యతో పాటు సొసైటీ ప్రిన్సిపల్‌ జ్యోతి, సంస్థ ప్రతినిధులు గంగాధర్‌, ఎన్‌వి సోమేశ్వర్‌, సుధాకర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *