Breaking News

ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాల‌ కోసం, విద్యారంగాన్ని బాగుచేయడం కోసమే జరిగిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల‌ చేయాల‌ని, నిరుద్యోగ భృతి అమలు చేయాల‌ని పిడిఎస్‌యు, పివైఎల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఉపాధి క‌ల్ప‌న కార్యాల‌యం ముందు బుదవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పివైఎల్‌ జిల్లా అధ్యక్షు కిషన్‌, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాల‌ కోసం, విద్యారంగాన్ని బాగుచేయడం కోసమే జరిగిందన్నారు. కానీ రాష్ట్రంలో విద్యార్థుల‌ పట్ల, నిరుద్యోగుల‌ పట్ల ప్రభుత్వ తీరు కక్షపూరితంగా ఉందన్నారు. ఎన్నికల‌ సమయంలో యువతకు 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌ సర్కార్‌, సంవత్సరమైనా ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. ఉద్యోగాల‌ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్య వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భర్తీ చేసేలా ఉద్యోగాల‌ నోటిఫికేషన్లు విడుద చేయాల‌ని, వచ్చే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి విద్యారంగానికి అవసరమైన నిధుల‌ను కేటాయించాల‌ని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామన్నారు.

కార్యక్రమంలో పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సత్యం, సుమన్‌ పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌, నాయకులు నిఖిల్‌, భాస్కర్‌, మోహన్‌, భోజెంధర్‌, కళ్యాణ్‌, నరేందర్‌, రాజేశ్వర్‌, ప్రత్యూష, దుర్గాప్రసాద్‌, కార్తిక్‌, సాయికృష్ణ, సాయితేజ, రమేష్‌ చారి, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *