Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల‌ చేయాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల‌ చేసి నిరుద్యోగుల‌ ఆత్మహత్యను నివారించాల‌ని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాల‌న్నారు.

పిడిఎస్‌యు నిజామాబాద్‌ జిల్లా కమిటీ సమావేశం బుదవారం ఆర్మూర్‌లో జరిగింది. సమావేశానికి శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు. పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న‌, కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌, నరేందర్‌, ప్రశాంత్‌, ప్రియాంక, రాజేశ్వర్‌, కుమార్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *