Breaking News

Daily Archives: February 20, 2020

బ్యాంక్‌ లింకేజీ రుణాలు నెల‌ చివరికల్లా పూర్తిచేయాలి

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా మహిళా సంఘాలు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఈనెల‌ చివరికల్లా సలకాలంలో పూర్తిచేయాల‌ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సంధ్యారాణి అన్నారు. మండల‌ కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బేగరి గంగామణి అధ్యక్షతన మండల‌ సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019`20లో తీసుకున్న బ్యాంక్‌ లింకేజీ రుణాలు పూర్తిచేసి మరిన్ని నిధులు పొందాల‌ని సూచించారు. అనంతరం ఏపిఎం చిన్నయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని సంఘాలు సిఐఎస్‌ ...

Read More »

గ్రామాలో గ్రీన్‌ ప్లాన్‌ కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల‌లో గ్రీన్‌ ప్లాన్‌ ప్రణాళికలు సిద్దం చేసుకోవాల‌ని ఎంపిడివో గోపాల‌కృష్ణ అన్నారు. మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలోని సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. వారినుద్దేశించి ఎంపిడివో మాట్లాడారు. 2020`21 ఏడాదికి సంబంధించిన హరితహారం మొక్కల‌కు సంబంధించిన నర్సరీ ఏర్పాటు విషయం పకడ్బందీగా చేపట్టాల‌న్నారు. గ్రామాల‌లో అవసరమున్న అన్ని రకాల‌ మొక్కల‌ పెంపకం కోసం నర్సరీల‌ను సిద్దం చేసుకొని ల‌క్ష్య ...

Read More »

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటాం

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చనిపోయిన గేదెలు, ఎడ్ల కుటుంబాల‌ను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తానని పశు సంవర్దక శాఖాధికారి బాలీక్‌ హైమద్‌ అన్నారు. మండలంలోని నీలా క్యాంపు గ్రామంలో గురువారం తెల్ల‌వారుజామున పలు కుటుంబాల‌ రైతుల‌కు సంబంధించిన మూగజీవులు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాయి. విషయాన్ని రైతులు స్థానిక పశు వైద్యాధికారికి వివరించారు. దీంతో గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్థానిక పశు వైద్యాధికారులు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారికి ...

Read More »

సిపిఐ నిర్మాణ మహాసభల‌ను విజయవంతం చేయండి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచిర్యాల జిల్లాలో ఈ నెల‌ 22 నుండి 24 వరకు జరిగే సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) రాష్ట్ర నిర్మాణ మహా సభల‌ను విజయవంతం చేయాల‌ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్ పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాల‌యంలో విలేకరుల‌తో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తుందన్నారు. అదే విదంగా బిజెపి అనుబంధ సంస్థలు గోరక్షణ పేరుతో దళితులు, మైనార్టీ పేరుతో దాడులు చేస్తున్నారని అన్నారు. ...

Read More »

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని స్వరూప రాణి అనే మహిళ హాస్పిటల్‌ లోచికిత్స పొందుతుండగా సీఎం సహాయ నిధి కింద రెండు ల‌క్షల రూపాయల‌ చెక్కును ఎంపీపీ అంజన్న, ఎఎంసి చెర్మెన్‌ గోపీగౌడ్‌ అందజేశారు.

Read More »

ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి సన్మానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ మంద నాగేశ్వరావుని నిజామాబాద్‌ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు గురువారం సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల‌గం హనుమాండ్లు, సల‌హాదారులు రాపల్లి గురు చరణం పాల్గొన్నారు.

Read More »

నిజాంసాగర్‌ నీటిని సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల సల‌హా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి ఈనెల 20వ తేదీ నుండి డి 27 నుండి డి 38 కాలువ‌ ద్వారా విడుదల‌ చేస్తున్న సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాల‌యం నుండి జిల్లా అధికారులు, సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డి 27 నుండి ...

Read More »

శాంతిభద్రతల పరిరక్షణకు సిసి కెమెరాలు

నందిపేట్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని నందిపేట్‌ ఎస్సై రాఘవేందర్‌ అన్నారు. సిసి కెమెరాల‌తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సాక్షాధారాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. నందిపేట్‌ మండలం వ్మెల్‌ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల‌ను ఎస్సై రాఘవేందర్‌ గురువారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసి కెమెరాల‌తో దొంగతనాల‌కు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. శాంతిభద్రతల‌ను పరిగణలోకి ...

Read More »