Breaking News

శాంతిభద్రతల పరిరక్షణకు సిసి కెమెరాలు

నందిపేట్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని నందిపేట్‌ ఎస్సై రాఘవేందర్‌ అన్నారు. సిసి కెమెరాల‌తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సాక్షాధారాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. నందిపేట్‌ మండలం వ్మెల్‌ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల‌ను ఎస్సై రాఘవేందర్‌ గురువారం ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసి కెమెరాల‌తో దొంగతనాల‌కు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. శాంతిభద్రతల‌ను పరిగణలోకి తీసుకొని గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. స్థానిక ఎంపిడిఓ నాగవర్ధన్‌ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు వ‌ల్ల‌ దొంగతనాల‌ను అరి కట్టవచ్చని, గ్రామంలో ఏదైనా ప్రమాదం జరిగినా ప్రమాదానికి కారణాలు తెలుసుకొని మరలా జరగకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు.

రెండవ విడతగా ఇంకా ఏమైనా కెమెరాలు అవసరం ఉంటే దానికి కూడా సహకరిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మచ్చర్ల సాయమ్మ, ఉప సర్పంచ్‌ ముప్పెడ నారాయణ, మండ వైస్‌ చైర్మన్‌ గొజ్జి దేవేందర్‌, ఎంపీటీసీ ఎనుగుర్తి మీనా, పంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ కమిటీ అధ్యక్షుడు రాపర్తి పెద్ద రాజేశ్వర్‌, పశువుల‌ భూమన్న, మేదరి భోజన్న పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *