Breaking News

సిపిఐ నిర్మాణ మహాసభల‌ను విజయవంతం చేయండి

కామారెడ్డి, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచిర్యాల జిల్లాలో ఈ నెల‌ 22 నుండి 24 వరకు జరిగే సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) రాష్ట్ర నిర్మాణ మహా సభల‌ను విజయవంతం చేయాల‌ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్ పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాల‌యంలో విలేకరుల‌తో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తుందన్నారు.

అదే విదంగా బిజెపి అనుబంధ సంస్థలు గోరక్షణ పేరుతో దళితులు, మైనార్టీ పేరుతో దాడులు చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా మోడీ ప్రభుత్వం యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి యువతను తప్పుదారి పట్టించారని వారు అన్నారు. అంతే కాకుండా నిత్యవసర ధరలు పెరగడం వ‌ల్ల‌ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. అలాగే జియస్‌టి, న‌ల్ల‌ధనం వెలికితీత, నోట్ల రద్దు వ‌ల్ల‌ ప్రజల‌కు ఒరిగిందేమీ లేదని వారన్నారు.

అంతే కాకుండా బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల‌ను ప్రయివేట్‌ పరం చేస్తుందని, కార్పొరేట్‌, ఆరెస్సెస్‌ కనుసన్నల్లో బిజెపి పని చేస్తుందని, ప్రశ్నించే గొంతును నొక్కివెయ్యాల‌ని కుట్ర పన్నుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చినా ప్రజల‌కు చేసిందేమి లేదని, రాష్టంలో ప్రజల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని పేర్కొన్నారు.

రెండు పడక గదుల‌ ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు ఇచ్చి ప్రజల‌ను మోసం చేశారని దశరథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ కనుసన్నల్లో పనిచేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌పై పోరాటాల‌కు భవిష్యత్తు కార్యాచరణ ఎజెండా వంటివి నిర్మాణ మహాసభలో రూపొందించుకుంటామని చెప్పారు.

కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.బాల‌రాజు, సీపీఐ కార్యవర్గ సభ్యులు జూకంటి సుధాకర్‌, జిల్లా నాయకులు ఎస్‌.ఆర్‌ రాజశేఖర్‌, బండారి రాజిరెడ్డి ,నరేష్‌ తదితరులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *