Breaking News

శివాల‌యాల‌ వద్ద అన్నదానం

రెంజల్‌, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శివాల‌యాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఉదయం నుండి శైవక్షేత్రాలు భక్తుల‌తో కిటకిటలాడాయి. శనివారం ఉపవాస దీక్షలు ముగించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆల‌యాల‌కు చేరుకుని శివలింగానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఉపవాస దీక్షలు ముగించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల‌కు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తెప్పలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article