Breaking News

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటాం

రెంజల్‌, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు సంబంధించిన మూగజీవాలు అస్వస్థతకు గురై చనిపోయిన గేదెల కుటుంబాల‌ను ఆదుకునేందుకు కృషి చేస్తామని వెటర్నరీ బయోలాజికల్‌ రిసర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ ముజీబ్‌ అత్తర్‌ అన్నారు. శనివారం మండలంలోని నీలాక్యాంప్‌ గ్రామంలో పలు కుటుంబాల‌ రైతుల‌కు చెందిన మూగజీవాలు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందడంతో రెండు రోజులు గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేలు అందించారు.

పరిస్థితిని జిల్లా అధికారులు స్టేట్‌ రిసర్చ్‌ అధికారుల‌కు అందజేయడంతో స్పందించిన ఆయన నీలా క్యాంప్‌ గ్రామానికి చేరుకుని తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న గేదేల‌ను పరిశీలించి కుటుంబ సభ్యుల‌కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన గేదెల‌కు సంబంధించిన పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ద్వారా వివరాలు సేకరించి బాధితుల‌కు న్యాయం కోసం కృషి చేస్తామన్నారు. మూగజీవాలు ఆరోగ్యంగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో ప్రభుత్వం శిబిరాల‌ను ఏర్పాటు చేసి వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందన్నారు.

నష్టపోయిన రైతుల‌కు ప్రభుత్వం ద్వారా చేయూతనందజేసేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అస్వస్థతకు గురైన మూగజీవాల‌కు తగిన వైద్య సేవ‌లు అందించేందుకు తమ సిబ్బంది ఎ్లవేళలా అందుబాటులో ఉండి సేలు అందిస్తారన్నారు. ఆయన వెంట అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దేవేందర్‌, జేడీఏ బాలిక్‌ అహ్మద్‌, వైద్యాధికారి విఠల్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article