Breaking News

విద్యార్థుల‌కు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

రెంజల్‌, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల‌కు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాల‌ని ఎంపీపీ లోల‌పు రజినీ కిషోర్‌ అన్నారు. మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాల‌తో పాటు ప్రభుత్వ పాఠశాల‌ను సర్పంచ్‌ సునీతతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, పాఠశాల‌, అంగన్వాడీల‌కు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థు ల హాజరు శాతం పరిశీలించారు.

విద్యార్థుల‌ హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులే కృషి చేయాల‌ని అన్నారు. ఉపాధ్యాయుల‌ బోధన తీరును పరిశీలించి విద్యార్థుల‌తో చర్చించారు. పాఠశాల‌లో ఏమైనా సమస్య‌లుంటే తమ దృష్టికి తేవాల‌ని, సమస్యల‌ పరిష్కారానికి కృషి చేస్తామని ఉపాధ్యాయుల‌కు సూచించారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత, ఉపసర్పంచ్ ల‌క్ష్మీ, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, సాయిులు, కార్యదర్శి సాయిబాబా, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, కిషోర్‌, ఉపాధిహామీ క్షేత్రసహాయకుడు మధు, అంగన్‌వాడి కార్యకర్తలు రాణి, అరుణ, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article