Breaking News

బుధవారం సెల‌వు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే బుధవారం ప్రైవేట్‌గా పనిచేసే ప్రతి ఒక్కరికి యాజమాన్యాలు సెల‌వు మంజూరు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన నాగారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రతి ఇంటి పరిసరాలు, ఇంటి ముందు వీధులు ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవడానికి ప్రైవేటు యాజమాన్యాల‌లో, దుకాణాల‌లో, సంస్థల‌లో పనిచేసే సిబ్బందికి, ఉద్యోగుల‌కు ఆ యాజమాన్యాలు సెల‌వు మంజూరు చేయాల‌ని కలెక్టర్‌ తెలిపారు. ఉద్యోగుల సెల‌వు రోజు వృధా చేయకుండా తప్పనిసరిగా వారి ఇంట్లో, ఇంటి ముందు పరిసరాల‌ను శుభ్రం చేసుకోవాల‌ని, ఎక్కడ కూడా అపరిశుభ్రత కనిపించ వద్దని, పిచ్చి మొక్కలు కనిపించకూడదని, మొక్కలు నాటాల‌ని, మోరీలు శుభ్రం చేయించాల‌ని సూచించారు.

చెత్తను మోరీలో లేదా రోడ్లపైన వేయవద్దని తమ ఇంటి వద్దకు వచ్చే మున్సిపాలిటీ వారికి ఇవ్వాల‌ని స్పష్టం చేశారు. మెప్మా మహిళా సంఘా ల వారు కూడా ఈ దిశగా ప్రజల‌కు అవగాహన కల్పించాల‌ని, ఇంకా ఇండ్లల్లో పనికిరాని పాత వస్తువులు గాని పాత బట్టలు కానీ ఉంటే మున్సిపాలిటీ వారికి అప్పగించి పట్టణ ప్రగతిలో సమూల‌ మార్పున‌కు, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషిచేయాల‌న్నారు. సర్వేలో ఏ ఇంటికి ఏ మొక్క కావాలో వివరాలు సేకరించాల‌న్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *