Breaking News

Daily Archives: February 26, 2020

10వ వార్డులో పట్టణ ప్రగతి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి 10 వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పదో వార్డు సభ్యురాలు ఉరుదొండ వనిత రవి, ఇంచార్జ్‌ హార్టిక్చర్‌ ఆఫీసర్‌ శేఖర్‌ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి నీరుపోశారు. గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్‌ శివాజీ గణేష్‌, గ్రామాభివ ృద్ధి కమిటీ అధ్యక్షుడు నారాయణ రావు, కుసుమ సిద్ధిరాములు, మాజీ వార్డు నెంబర్ నీలం సుధాకర్‌ మోహన్‌, రవి, ఆరిఫ్‌, రాజయ్య, స్వామి, అరుణ్‌ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

పరీక్షల సమయంలో విద్యార్థుల‌కు ఫీజుల‌ బెడద

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజుల‌ పేరుతో విద్యార్థుల‌ను ఇబ్బందికి గురి చేస్తున్న ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాల‌లపై చర్యలు తీసుకోవాల‌ని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌ నరేష్‌ కుమార్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలల‌ వారు ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఫీజుల‌ పేరుతో విద్యార్థుల‌ను అనేక ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయడంతో మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. సేవా దృక్పథంతో, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రయివేట్‌ జూనియర్‌ ...

Read More »

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ట్రాక్టర్లు సేకరించడంతో పాటు విద్యుత్ బిల్లులు చెల్లింపు, నర్సరీలో మొక్కలు పెంచడం ఇతర పనుల‌న్నీ పూర్తిచేయాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌తో పల్లె ప్రగతి పనుల‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్‌ కొనుగోలు, నర్సరీలో మొక్కల‌ను త్వరగా విత్తడం, గ్రామ పంచాయతీ కరెంట్ ...

Read More »

విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని కలిసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌ సీనియర్‌ ఐఎఎస్‌ ని తెలంగాణ విశ్వవిద్యాయం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ విశ్వవిద్యాయ అకడమిక్‌ అభివృద్ధి విశేషాంశాల‌ను గూర్చి చిత్రా రామచంద్రన్‌ తో చర్చించినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాయానికి చిత్రా రామచంద్రన్‌ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాయ క్యాలెండర్‌ 2020 ను చిత్రా రామచంద్రన్‌కి బహూకరించారు. శాలువా, ...

Read More »

సంక్షేమ పధకాల అమలు కోసం పోరాటాలు చేస్తాం

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఎంసిపిఐయు పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ నెల‌ 23, 24, 25 తేదీల‌లో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండల‌ కేంద్రంలోని తిరుమల‌ గార్డెన్‌లో నిర్వహించడం జరిగిందని పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రాజలింగం, సహాయ కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా మూడు రోజుల‌ పాటు జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ఇప్పుడు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిస్థితుల‌పై రాజకీయ పరిణామాల‌పై కార్మిక, కర్షక విద్యార్థి యువజన మహిళా రంగాల‌పై ...

Read More »

26వ డివిజన్‌లో పట్టణ ప్రగతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ బంటు వైష్ణవి రాము సూచించారు. రోడ్లు, మురికి కాలువల్లో చెత్త వేయవద్దని అన్నారు. నిజామాబాదు నగరంలోని 26 వ డివిజన్‌లో బుదవారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురికి కాలులు, రోడ్లు శుభ్రం చేయించారు. స్థానిక కార్పొరేటర్‌ బంటు వైష్ణవి రాము మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బందితో కలిసి డివిజన్‌లో తిరుగుతూ ప్రజ ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

రఘునాథ ఆల‌యంలో చోరీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని చరిత్రాత్మకమైన ఖిల్లా రఘునాథ ఆల‌యంలో దొంగతనం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆల‌యంలోకి చొరబడిన దొంగలు మూడు హుండీల‌ను పగుల‌గొట్టి దోపిడీకి పాల్్ప‌డ్డారు. ఆల‌య గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న 5 వ టౌన్‌ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. ఆల‌య చైర్మన్‌ ముక్కా దేవేందర్‌ గుప్త మాట్లాడుతూ ఆల‌యానికి ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పగుల‌గొట్టి దుండగులులోనికి ప్రవేశించారని తెలిపారు. చారిత్రాత్మక దేవాల‌యమైన ఖిల్లా రామాల‌యానికి ...

Read More »

నగరాల‌ను అందంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణాలు, నగరాల‌ను అందంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ విఠల్‌ రావు చెప్పారు. పట్టణ నగర వాసుందరూ పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాల‌ని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిజామాబాదు జిల్లా పరిషత్‌ కార్యాల‌య ఆవరణలో బుదవారం నిర్వహించారు. జిల్లా పరిషత్‌ సముదాయంలోని పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌, ఆర్‌ డబ్ల్యూఎస్‌, జిల్లా పంచాయతీ కార్యాల‌యం, క్యూసి కార్యాల‌యాల‌లో అపరిశుభ్రంగా ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఈ ...

Read More »

మురుగు కాల్వ‌లు దాటి ఏది ఉండొద్దు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో డ్రెయిన్స్‌ బయట ప్రైవేట్‌వి ఏవి కూడా ఉండవద్దని, వెంటనే తొల‌గించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన బుధవారం 44, 28, 50వ డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకా మోరీలు అపరిశుభ్రంగా ఉండడం, రోడ్లపైన కూల‌గొట్టిన ఇండ్ల సామాను ఇంట్లో మెటీరియల్‌ వేయడంపై మీరేం చేస్తున్నారని సంబంధిత డివిజన్‌ సభ్యుల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలీల్‌ వాడి, సరస్వతి నగర్‌, ద్వారకా ...

Read More »

27న ‘జిల్లా జిల్లాలో కేంద్ర జిఎస్‌టి మీ వద్దకు’ కార్యక్రమం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెంట్రల్‌ జిఎస్‌టి హైదరాబాద్‌ వారు నిర్వహిస్తున్న ‘జిల్లా జిల్లాలో కేంద్ర జీఎస్‌టి మీ వద్దకు’ కార్యక్రమంలో భాగంగా జీఎస్‌టి చట్టానికి సంబంధించిన అన్ని విషయాలో సహాయం అందించడానికి, సందేహాల‌ను నివృత్తి చేయడానికి చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య, కమిషనర్‌ ఎన్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ మురళి క్రిష్ణ, వారి బృందం నిజామాబాద్‌ జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈనె 27న ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక న్యూ అంబేడ్కర్‌ ...

Read More »

అన్ని నియోజకవర్గాల‌కు అర్బన్‌ పార్కులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణాల్లో ఆహ్లాదకర వాతావరణం కొరకు అడవులు దగ్గరగా ఉన్న అన్ని నియోజకవర్గాల‌లో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖామాత్యులు ఏ. ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం సారంగాపూర్‌ వద్ద అటవీ అర్బన్‌ పార్క్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు వ‌ల్ల పిల్ల‌లు ఆటలు ఆడుకోవడానికి పెద్దలు వాకింగ్‌ చేయడానికి ...

Read More »

ఆదర్శం గూపన్‌పల్లి యువత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 3వ డివిజన్‌ గూపన్‌పల్లికి చెందిన బెన్సన్‌ రాజ్‌ యొక్క ఇరవై అయిదవ రక్తదానం సందర్భంగా గూపన్‌పల్లి యువత రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. దాదాపు ఇరవై మంది యువత ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మనిషి మేధస్సు ఉపగ్రహాల‌ను తయారు చేయగలిగినా గానీ రక్తాన్ని తయారు చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. నేడు మనిషిలోని మానవత్వాన్ని బయటకు తీస్తున్నది రక్తదానమే అని గుర్తు చేశారు. డబ్బు పెడితే దొరికేది ...

Read More »