Breaking News

నర్సరీలు పరిశీలించిన కలెక్టర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పర్యటించి నర్సరీల‌ను, తహసిల్దార్‌ కార్యాల‌యాల‌ను పరిశీలించారు. గురువారం కలెక్టర్ వేల్పూర్‌ తహసిల్దార్‌ కార్యాల‌యంలో పర్యటించి అన్ని విభాగాల‌ను పరిశీలించారు. ప్రభుత్వం కొత్తగా ఎనిమిది బ్యాటరీలు అందించగా దానికి యుపిఎస్‌ అవసరం ఉన్నందున కలెక్టరేట్‌ ఏఓకు ఫోన్‌ చేసి అన్ని తహసిల్దార్‌ కార్యాల‌యాల్లో ఈ పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల‌న్నారు.

రెండు మండలాల కార్యాల‌యాల్లో కూడా మొక్కలు నాటడానికి ఇంకా స్థలం ఖాళీగా ఉన్నందున చర్యలు తీసుకోవాల‌ని తహసిల్దార్‌ను ఆదేశించారు. పాత బోర్డు తొల‌గించి అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాల‌న్నారు. నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని గ్రామ పంచాయితీల‌లో మొక్కల‌కు నీటిని అందించడానికి అంచనాలు తయారుచేసి ఉపాధి హామీ కింద మీరు అందించడానికి చర్యలు తీసుకోవాల‌న్నారు.

వేల్పూర్‌లో బాత్రూమ్‌ల‌ను ప్రజల‌కు అందుబాటులో ఉంచాల‌ని, పరిసరాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకోవాల‌న్నారు. ప్రజల‌కు అవగాహన కల్పించి ఇంటింటికీ మొక్కలు నాటుకునేలా చూడాల‌న్నారు. కార్యాల‌య పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నందుకు అభినందించారు.

స్థలాల‌ను పరిశీలించి పనులు ప్రారంభించాల‌ని ఆదేశించారు. కోన సముందర్‌ వినాయక నగర్‌లో స్మశాన వాటికలు, కంపోస్టు షెడ్‌ పరిశీలించారు. వ్పేూర్‌ వద్ద పొలాల‌ గట్ల వెంట కొన్ని చెట్లు ఎండిపోవడంతో ఉద్యానవన శాఖ అధికారుల‌తో పరిశీల‌న చేయించాల‌న్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్లు ఎంపీడీవోలు, అధికారులు, తదితరులు ఉన్నారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article