Breaking News

పట్టణ అభివృద్దికి నిధులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలోభాగంగా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క కాల‌నీ వాసులు తాము నివసించే కాల‌నీ పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, పాత స్థలాల్లో మొక్కలు తీయించి వాటిని శుభ్రంగా చేయిస్తున్నామని, తడి, పొడి చెత్త వేరు వేరు డబ్బాల‌లో వేసి మున్సిపల్‌ నుండి ఏర్పాటు చేసిన చెత్త సేకరణ వాహనంలో నే వేయాల‌ని, ఖాళీ ప్రదేశాల‌లో మల‌, మూత్ర విసర్జన చేయకూడదని, దాని వ‌ల్ల‌ మనం నివసించే కాల‌నీలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఆర్మూర్‌ పట్టణంలో ప్రతి కాల‌నీలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగిందని, అవసరమైన ప్రదేశాల‌లో సీసీ డ్రైన్స్‌, రోడ్ల నిర్మాణంతో పాటు రోడ్ల పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మార్కెట్‌, బస్టాండ్‌ రద్దీగా ఉండే ప్రదేశాల‌లో టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ప్లాస్టిక్‌ ఫ్రీ ఆర్మూర్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక సిద్ధం చేయడం, దీనికి పట్టణవాసుల‌ సహకారం ఎంతో అవసరమని కోరారు.

అందరూ ఏకధాటిగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్ములించాల‌ని, నీటి నిలువ‌ ఉన్న ప్రదేశాల‌లో మొరం వంటివి పోయించేలా స్థానిక కౌన్సిల‌ర్లు శ్రద్ద వహించాల‌ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఆర్డిఓ శ్రీనివాసు, చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, కమిషనర్‌ శైల‌జ, వార్డు కౌన్సిల‌ర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *