Breaking News

ఎస్‌ఆర్‌లో వీడుకోలు వేడుక

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గల‌ ఎస్‌ఆర్‌ డిజి పాఠశాల‌లో శుక్రవారం పదవ తరగతి విద్యార్థుల‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఆర్‌ డిజి జోనల్‌ ఇంచార్జ్‌ భగవాన్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాలంటే, పట్టుదల‌ ఉండాల‌ని, పట్టుదల‌తో అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.

జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కొని, తమ అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని భగవాన్‌ రెడ్డి సూచించారు. విద్యార్థుల‌ను సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రుల‌తో పాటు ఉపాధ్యాయుల‌పై కూడా ఉంటుందని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, విద్యార్థుల‌కు మంచి భవిష్యత్తును ఇవ్వాల‌ని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ డిజీ పాఠశాల‌ ప్రిన్సిపల్‌ ప్రణీత్‌ కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article