Breaking News

పట్టణ రూపురేఖలు మార్చుదాం

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యల‌ పరిష్కారానికి ప్రజల‌కు ఇంతగా ప్రజల‌ చెంతకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వస్తున్నారని, ప్రతి ఇంటికి ఆరు మొక్కల‌ను మున్సిపాలిటీ ద్వారా ఇస్తున్నామని, వాటిని నాటి సంరక్షించాల‌ని కోరారు.

పట్టణాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాల‌ని స్పీకర్‌ సూచించారు. పరిసరాల‌ పరిశుభ్రత పాటించాల‌ని, రోడ్లపై చెత్త వేసిన వారికి మున్సిపల్‌ అధికారులు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించి ప్రజ ఆరోగ్యాన్ని కాపాడతామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాల‌ని సూచించారు. మొక్కల‌తోనే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, వార్డు కౌన్సిల‌ర్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *