Breaking News

అక్రమాల‌కు పాల్పడితే చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ శుక్రవారం పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, ట్రాక్టర్ల కొనుగోలుకు రూపాయలు ల‌క్షా 75 వేల‌ కంటే అదనంగా డ్రా చేస్తే అటువంటి వారి నుంచి తిరిగి రికవరీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ మండల‌ స్థాయి అధికారుల‌కు సూచించారు. డబ్బు చెల్లించని వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నాణ్యమైన ట్రాక్టర్లను ఏజెన్సీలు అందించాల‌ని కోరారు. అధికారులు నాణ్యమైన ట్రాక్టర్లు తీసుకొని పంచాయతీల‌కు వారం రోజుల్లో అప్పగించాల‌ని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లోగా ట్రాక్టర్‌ల‌కు సంబంధించి బిల్లులు జిల్లా కార్యాల‌యంలో అందించాల‌ని సూచించారు. బిల్లుతో పాటు సంబంధించిన నివేదికను అందజేయాల‌ని చెప్పారు.

కొందరు సర్పంచులు ట్రాక్టర్లు కొనుగోలులో అక్రమాల‌కు ప్పాడినట్లు పత్రికల్లో వచ్చిన కథనాల‌ ఆధారంగా విచారణ జరిపి అధికారులు తమకు నివేదికలు అందించాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌, ప్రత్యేక కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డిపివో సాయన్న, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *