Breaking News

మోడల్‌ పాఠశాల‌లో సైన్స్‌ దినోత్సవం

రెంజల్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలోని మోడల్‌ పాఠశాల‌లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల‌ ఉపాధ్యాయ సిబ్బంది సర్‌ సివి రామన్‌ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం సైన్స్‌ మేళ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతతో పనికిరాని వస్తువుల‌ను ఉపయోగించి కళాత్మకమైన వస్తువుల‌ను రూపొందించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్‌, బయాల‌జీ, సామాజిక శాస్త్రాల‌కు సంబంధించిన సాంకేతిక పరికరాలు ఆహూతుల‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article