Breaking News

Daily Archives: February 29, 2020

పశువు తల‌పై అనుమానాలు

రెంజల్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో ఓ మతానికి చెందిన ధ్వజానికి కొద్దిదూరంలో పశువు తల‌ ఉండడంతో దీనిపై విచారణ చేపట్టాల‌ని ఎస్‌ఐ శంకర్‌కు గ్రామస్తులు కోరారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ శంకర్‌ ఈ విషయంపై విచారణ చేపడతామని పశువు తల‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారా లేదా కొన్ని కుక్కలు చనిపోయినటువంటి పశువు తల‌ను లాక్కొని రోడ్డు పైకి తెచ్చాయా అనే దానిపై పూర్తిగా విచారణ జరుపుతామని ...

Read More »

ఏడవ ఎకనామిక్‌ సర్వే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఏడవ ఎకనామిక్‌ సర్వే గోడ ప్రతుల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన ఆవిష్కరించారు. సర్వేలో అన్ని ఇండ్లల్లో పర్యటించి వ్యవసాయం మినహా ఇతర వృత్తులు నిర్వహించే కుటుంబాల‌ వివరాల‌ను సేకరించనున్నారు. ఆవిష్కరణలో సిపిఓ శ్రీ రాములు, ఆర్‌డిఓ వెంకటయ్య, సిఎస్సి జిల్లా సమన్వయకర్త శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

టెన్త్‌ విద్యార్థుల‌ స్నాక్స్‌ కొరకు ఆర్థిక సహాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల‌ కొరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థుల‌కు సాయంత్రం స్నాక్స్‌ అందజేయడానికి గుండారం లోని క్లాసిక్‌ పేపర్ మిల్లు, రెంజల్‌లోని వివా బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి ల‌క్ష రూపాయల‌ చెక్కును సహాయం అందజేశారు. కలెక్టర్‌ ఇందుకు ఆయనను అభినందించారు.

Read More »

విద్యార్థుల‌కు పరీక్ష అట్టల పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలో శనివారం పార్శి విట్ఠల్‌ పటేల్‌ పేద విద్యార్థుల‌ సౌకర్యార్థం పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో వారికి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. కళాశాల‌ అభివృద్దికమిటి అధ్యక్షుడు మాజీ జెడ్‌.పి.టి.సి సీనియర్‌ తెరాస నాయకుడు గండ్ర మధుసూదన్‌ రావు చేతుల‌మీదుగా మెటీరియల్‌ పంపిణీ చేశారు. మధుసూదన్‌ రావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కాలేజీకి మంచి పేరు తేవాల‌ని, ఉపాద్యాయులు సహకరిస్తారని అన్నారు. ...

Read More »

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌కు ‘భగవద్గీత’

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుదా నారాయణ మూర్తిని తిరుమల‌లోని వసతి గృహంలో నిజామాబాదుకు చెందిన మంచాల‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మంచాల‌ జ్ఞానేందర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవద్గీత అందజేశారు. తిరుమల‌లో శ్రీ స్వామి వారి దర్శనానికి వెళ్లిన మంచాల‌ జ్ఞానేందర్‌ బస చేసిన వసతి గృహంలోనే ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ ఉన్నారని తెలియడంతో ఆమెను కలిసి శాలువతో సన్మానించి భగవద్గీత బహుకరించారు. ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ఎవరూ ...

Read More »

పారిశుద్ధ్యం, పచ్చదనం అత్యంత ప్రాధాన్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. 23 వ వార్డు శకర్‌ నగర్‌, 35, 36 వార్డు షర్బత్‌ కెనాల్‌, 8వ వార్డు గాంధీ పార్క్‌, 28వ వార్డు మార్కెట్‌, 18వ వార్డు శ్రీనివాస్‌ నగర్‌ తదితర ప్రాంతాలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇతర సమస్యల‌పై స్థానిక ...

Read More »

అత్యవసర పరిస్థితిలో బాధితురాలికి రక్తదానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాత్రి నిజామాబాద్‌ బాబన్‌ సాహెబ్‌ పహాడ్‌లో నివాసం ఉంటున్న బిస్మిల్లాబీ బయటకు రాగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో శ్రీకృష్ణ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్టు వారి బంధువులు తెలిపారు. కాగా బిస్మిల్లాబి యొక్క రక్తం ఏ నెగిటివ్‌, చాలా అరుదైన రక్తం కావడంతో రాత్రి ఎంత ప్రయత్నించినా దొరక లేదు. ఇటువంటి స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి నిర్వాహకులైన గౌస్‌ మోయినుద్దీన్‌ ...

Read More »