Breaking News

పట్టణ ప్రగతిపై ప్రజల‌ సంతృప్తి

నిజామాబాద్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో నిర్వహిస్తున్న కార్యక్రమాల‌పై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అర్బన్‌ నియోజకవర్గం శాసనసభ్యులు గణేష్‌ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలోని 43 డివిజన్‌లో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, కమిషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో కలిసి మొక్కలు నాటి నీరుపోశారు. డివిజన్‌ వీధుల‌లో పర్యటించి ప్రజల‌తో మాట్లాడి సమస్యులు తెలుసుకున్నారు.

రైల్వే కమాన్‌ వద్ద జరుగుతున్న పనుల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో ప్రతిరోజు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజల‌ సమస్యులు తెలుసుకుంటున్నామని అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు అధికారుల‌కు చర్యల‌ కోసం ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ఇబ్బందులు ఏమిటో ప్రజల‌తో మాట్లాడటం ద్వారా తెలుసుకుంటున్నామని, ముఖ్యంగా పారిశుద్ధ్యం, స్తంభాల‌ మార్పు, లూజు వైర్స్‌ తదితర సమస్యలు ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని అయితే కొనసాగుతున్న పనుల‌పై ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాల‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో లేనివిధంగా పనులు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారని, ఈ పనుల‌ను కొనసాగించడానికి అవుట్‌సోర్సింగ్‌ లేబర్‌ను తీసుకున్నామని అవసరమైతే శాశ్వత ప్రాతిపదికన‌ కూడా తీసుకొని పనుల‌ను నిరంతరాయంగా కొనసాగిస్తామని అందుకు అనుగుణంగా అధికారుల‌ను, ప్రత్యేక అధికారుల‌ను సమాయత్తం చేసి ప్రజల‌కు సేలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ ప్రగతిపై తాము అత్యంత శ్రద్ధతో నిర్వహించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో పేర్కొన్న అన్ని పనులు పూర్తి చేసేంతవరకు కార్యక్రమాన్ని తదుపరి కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా భాగస్వాములై వారి వంతు సహాయ సహకారాలు అందించినప్పుడు పూర్తిస్థాయిలో నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి వీల‌వుతుందని తెలిపారు.

ఈ నెల 3న అన్ని డివిజన్లు / వార్డుల‌లో ప్లాంటేషన్‌డే నిర్వహిస్తున్నామని ప్రతి వార్డులో రెండు వందల‌కు తక్కువ కాకుండా మొక్కలు నాటించడానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని రోడ్లపైన చెత్త తొల‌గిస్తున్నారని, ఖాళీ స్థలాల్లో తొల‌గించడానికి యజమానుల‌కు నోటీసు జారీ చేయనున్నామని, వినకుంటే జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.

అనంతరం వారు రఘునాథ చెరువు వద్ద పనుల‌ను పరిశీలించారు. కార్యక్రమాల‌లో మున్సిపల్‌ అధికారులు, జిల్లా అధికారులు, అయిన అభిషేక్‌ సింగ్‌, కిషన్‌ రావు, కార్పొరేటర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article