Breaking News

కాశం సాయిులుకు వంజరి సంఘం సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామనికి చెందిన కాశం సాయిలును ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్‌గా నియమితులైనందుకు రావుజి వంజరి సంఘం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భూమయ్య శాలువా పూల‌మాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఎన్నికైన మున్సిపాలిటీ కార్పొరేటర్లు, సహకార సంఘం డైరెక్టర్లు ఎన్నికైన వంజరి కుల‌ సంఘం సభ్యులు వంజరుల‌ ఐక్యతకు పాటుపడాల‌ని సూచించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కరిపే సత్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కాశం సాయిలు, రవి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article