Breaking News

సకాలంలో పరిశ్రమల‌కు అనుమతులివ్వాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సకాలంలో పరిశ్రమల‌కు అనుమతులు ఇవ్వాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లాస్థాయి ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుమతుల‌ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుల‌ను క్షుణ్నంగా పరిశీలించి నిర్ణీత సమయంలో అనుమతలు మంజూరు చేయాల‌ని, అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తుదారుల‌కు తెలియ చేయాల‌ని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఇద్దరు ఎస్‌సి అభ్యర్థుల‌కు ఆరుగురు ఎస్‌టి అభ్యర్థుల‌కు మైక్రో యూనిట్ల ఏర్పాటు కొరకు 18 ల‌క్షల‌ రూపాయలు సబ్సిడీ మంజూరు చేయుటకు కమిటీ ఆమోదించింది. సమావేశంలో పరిశ్రమల‌ శాఖ జిల్లా మేనేజర్‌ బాబురావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఏడి శశికళ, ఎస్టీ కార్పొరేషన్‌ అధికారిని సంధ్యారాణి, సంబంధిత శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article