Breaking News

వ్యాపారులు రోడ్లపై కూర్చొని విక్రయించరాదు

నిజామాబాద్‌, మార్చ్‌ 2
నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాపారులు రోడ్లపై కూర్చొని విక్రయించరాదని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం వివిధ డివిజన్లలో కలెక్టర్‌, మేయర్‌ నీతూ కిరణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కూరగాయలు, మాంసం అమ్మేవారు రోడ్లపై విక్రయించరాదని అన్నారు. ఇకపై రోడ్లపై అమ్మితే ఐదు వేల రూపాయల‌ జరిమానా ఉంటుందని తెలిపారు.
58వ డివిజన్‌ అహ్మద్‌ బజార్‌లోని మటన్‌ మార్కెట్‌ మేక మార్కెట్‌ బీఫ్‌ మార్కెట్‌లో పర్యటించారు. కలెక్టర్‌ వ్యాపారుల‌తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు నూతన మార్కెట్‌ నిర్మించటానికి నిర్ణయించడమైనదని తెలిపారు. వ్యాపారులు తమ కమిటీ వారితో సంప్రదించి తమ అభిప్రాయాల‌ను వారంలోగా తెలియజేయాల‌న్నారు. మార్కెట్‌ నిర్మాణం ఆరు నెల‌ల్లో పూర్తి చేసి సిస్టమేటిక్‌గా షాప్స్‌ అలాట్‌ చేస్తామన్నారు.
33 వ వార్డులో నాలాల‌పై అక్రమ కట్టడాల‌ గురించి మున్సిపల్‌ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ అధికారులు వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. జేసిబి ల‌తో నాలాలోని సిల్‌ట్‌ తీయడం కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి. పాటిల్‌, డిప్యూటీ మేయర్‌ మొహమ్మద్‌ ఇద్రిస్‌, కార్పొరేటర్లు రహపత్‌ మహమ్మద్‌ ఖాన్‌, ఈ ఈ రషీద్‌ మున్సిపల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article