Breaking News

కళ్యాపూర్‌లో సిసి కెమెరాలు ప్రారంభం

రెంజల్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల‌ను బోధన్‌ ఏసిపి జైపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ కాశం నీరంజని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాపూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వివిధ గ్రామాల‌ ప్రజా ప్రతినిధులు తమ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌న్నారు.

ఒక్కొక్క సీసీ కెమెరా వెయ్యి మందితో సమానమని, ముఖ్యంగా గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే సీసీ కెమెరాల‌ ద్వారా గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపాల‌కృష్ణ, సీఐ షాకిర్‌ అలీ, ఉపసర్పంచ్ జల‌య్య, రైసస మండల‌ అధ్యక్షుడు కాశం సాయిలు, ఎస్సై శంకర్‌, ఎంపీఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, బీజేపీ నాయకులు మేక సంతోష్‌, కిషోర్‌, గ్రామస్తులు కుమార్‌, విలాస్‌, ల‌క్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article