Breaking News

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండుసార్లు పల్లె ప్రగతి నిర్వహించుకున్నప్పటికీ గ్రామం రూపురేఖలు మారకపోవడంపై అర్గుల్‌ గ్రామ కార్యదర్శి, క్షేత్ర సహాయకుడిని సస్పెండ్‌ చేయడంతో పాటు సర్పంచ్‌కు మెమో జారీ చేయడానికి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన జక్రాన్‌ పల్లి మండలం మునిపల్లి, ల‌క్ష్మాపూర్‌, నారాయణపేట, అర్గుల్‌ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనుల‌ను పరిశీలించారు.

మునిపల్లి గ్రామ రోడ్ల పక్కన మొక్కల‌కు ఏర్పాటుచేసిన ట్రీ గార్డులు వేరుగా పడి ఉండడంతో వాటిని తీసి తిరిగి మొక్కల‌కు ఏర్పాటు చేశారు. రోడ్ల వెంట వెళ్లే పశువుల వ‌ల్ల‌ అవి పడిపోతున్నాయని ప్రజలు తెల‌పడంతో వాచ్‌ అండ్‌ వాట్‌ ఇంచార్జ్‌ సరిచేయాల‌ని పశువుల‌ కాపరికి చెప్పి అలా జరగకుండా చూడవల‌సినదిగా ఆదేశించాల‌ని తెలిపారు. మొక్కలు పెద్దగా అయ్యేంతవరకు చంటి పిల్ల‌ లాగా చూడాల‌ని తెలిపారు. అర్గుల్‌ మినహా ఇతర గ్రామాల్లో పల్లె ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అర్గుల్‌ గ్రామపంచాయతీలో మాత్రం పల్లె ప్రగతి పనుల‌ ఏ మాత్రం బాగా లేవని, మొక్కలే నాటలేదని, నిర్వహణ బాగలేదని, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ఖాళీ స్థలాల‌ను శుభ్రం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా గ్రామ కార్యదర్శి రాజేశ్వర్‌ను, క్షేత్ర సహాయకుడు సాయన్నను సస్పెండ్‌ చేయవసినదిగా, అదేవిధంగా గ్రామ సర్పంచ్‌ పద్మ, పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం సరిగా విధులు నిర్వహించనందున ప్రభుత్వ ఆదేశాల‌పై అల‌సత్వం వహించినందున మెమో జారీ చేయాల‌ని ఆదేశించారు.

ఏ గ్రామంలో ఆయన రోడ్లపైన పెంట కుప్పులు ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొల‌గించాల‌ని లేదంటే సంబంధితుల‌పై చర్యులు తీసుకోవాల‌ని ఆదేశించారు. అనంతరం ఆయన మండల‌ కేంద్రంలో తహసిల్ కార్యాల‌యం, ఎంపీడీవో కార్యాల‌యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరును పరిశీలించి అన్ని విభాగాలు తిరిగి చూశారు.

తహసిల్‌ కార్యాల‌యంలో రైతు భూ సమస్యల‌పై కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. తహసిల్దార్‌కు, రైతుల‌కు పరిష్కారం కొరకు సూచనలు చేశారు. పర్యటనలో తహసిల్దార్‌ రాజు, ఎంపీడీవో భారతి, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *