Breaking News

జాతీయ రహదారిలో మొక్కలు కనిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారులో అన్ని వైపులా మొక్కలు నాటి అందంగా కనిపించేలా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఆయన తన పర్యటనలో గురువారం జాతీయ రహదారి 63, 44 లో 20 వేల‌ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు.

జాతీయ రహదారి 63 లో మూడు వేల‌ మొక్కలు, 44 వ జాతీయ రహదారిలో 17 వే మొక్కలు నాటడానికి ప్రణాళిక ప్రకారం అధికారులు ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్‌ జాతీయ రహదారి పిడి తరుణ్‌ కుమార్‌, డిఎఫ్‌ డాక్టర్‌ సునీల్‌, ఎస్‌ హిరమత్‌తో కలిసి మొక్కలు నాటి ప్రారంభించారు. 15 నుంచి 20 రోజుల్లో పూర్తి చేయాల‌ని అన్నారు. అనంతరం 7వ బెటాలియన్‌లో మొక్కలు నాటారు.

నూతనంగా నిర్మిస్తున్న గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ ఇంచార్జ్‌ కమాండెంట్‌ సత్య, శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ కె.వి రమణ, నేషనల్‌ హైవే అధికారులు చంద్రమోహన్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article