Breaking News

పసుపు లారీ దగ్దం

ఆర్మూర్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుగాలం కష్టించి పండిరచి, పంట తీసి మార్కెట్‌కు తీసుకపోతే ధర లేక పెట్టుబడి కూడా రాలేని పరిస్థితుల్లో రైతు నష్టపోతుంటే మరో దిక్కు ప్రకృతి పగబట్టినట్లయింది.

వివరాల్లోకి వెళితే… నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలోని ఎల్కాటూర్‌ గ్రామానికి చెందిన 11 మంది రైతుల‌కు సంబందించిన దాదాపు 274 బస్తాల‌ పసుపు లారీ మార్కెట్‌కు తరలిస్తుండగా కొత్తపల్లి గ్రామ శివారులో లారికి మంటలు చెల‌రేగి పసుపు కాలిపోయింది. ఇది చాలా దురదృష్టకరమని, ఎన్నో ఆశలు పెట్టుకొని పంటను మార్కెట్‌కు తరలిస్తుంటే విధి ఈ రకంగా రైతుకు కన్నీరు మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు 12 ల‌క్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాల‌ని రైతులు డిమాండ్‌ చేశారు. పూర్తిగా కాలిపోకుండా కొద్దిగా ఏమైనా దెబ్బతింటే అది ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని జరిగిన సంఘటనను కూడా ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి రైతుల‌కు పూర్తిగా నష్టపరిహారం అందించి ఆదుకోవాల‌ని అన్వేష్‌ రెడ్డి కోరారు. స్థానిక మంత్రి జరిగిన సంఘటనపై స్పందించి నష్టపోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని కిసాన్‌ కాంగ్రేస్‌ తరపున విజ్ఞప్తి చేశారు.

Check Also

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *