Breaking News

17న అసెంబ్లీ ముట్టడి

ఆర్మూర్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ నోటిఫికేషన్లకై ఈనెల 17న అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేయాల‌ని పివైఎల్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి నిమ్మ నిఖిల్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పివైఎల్‌ ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌లో శుక్రవారం విలేకరుల‌తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా నిరుద్యోగుల‌కు నిరాశే మిగిలిందన్నారు.

ల‌క్షపోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల‌ చేయక పోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం ఉద్యోగ‌ నోటిఫికేషన్లు విడుదల‌ చేయాల‌ని, నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈనెల‌ 17న తల‌పెట్టిన అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాల‌ని వారు కోరారు. కార్యక్రమంలో పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాకేష్‌, నాయకుడు రాకేష్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *