Breaking News

Monthly Archives: April 2020

249 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 249 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 222, ఆటోలు 26, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు గురువారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌ స్థలాన్ని సర్వే చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌ స్థలాన్ని సర్వే చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. స్థ‌లం చుట్టూ రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టాల‌ని సూచించారు. రాశి వనంలో మొక్కల‌ను పెంచి అడవి మాదిరిగా అభివృద్ధి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కల‌ను పెంచడానికి స్థలాన్ని ఎంపిక చేయాల‌ని కోరారు. మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ స్థలాల‌ను గుర్తించి ఉద్యానవనాల‌ను ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. ...

Read More »

కొనుగోలు కేంద్రాల‌ వద్ద మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రామారెడ్డి మండల‌ అధ్యక్షుడు గడ్డంప్రసాద్‌ ఇస్సన్నపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాల‌ను గురువారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల‌ పనుల‌ను పరిశీలించి ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి రైతు దగ్గర పక్షపాతం లేకుండా వడ్ల కొనుగోలు చేయాల‌ని సూచించారు. రైతుందరికీ వడ్లను సకాలంలో కొనుగోలు చేసి సమయానికి లారీల‌ను రప్పించి కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లుకు పంపించేటట్లు తగు జాగ్రత్తలు తీసుకొని రైతుల‌కు న్యాయం చేయాల‌ని ...

Read More »

కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ముగ్గురు అధికారుల‌ పదవీ విరమణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ముగ్గురు అధికారులు పదవి విరమణ చేశారని డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. తమ కార్యాల‌యంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ కరుణశ్రీ గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో సేవలందించారు. గత సంవత్సరం మాతా శిశు సంరక్షణ అధికారిగా ఈ యేడు జిల్లా ప్రయివేటు ఆసుపత్రుల‌ రిజిస్ట్రేషన్‌ అథారిటి అధికారిగా, లెప్రసి ప్రోగ్రాం అధికారిగా, జిల్లా కలెక్టర్‌ కేటాయించి ఆరోగ్య కేంద్రాల‌ ప్రోగ్రాం అధికారిగా విశిష్ట ...

Read More »

మెప్మా ఆధ్వర్యంలో మాస్కుల‌ విక్రయాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో మాస్కుల‌ను గురువారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ విక్రయ కార్యక్రమం ప్రారంభించారు. కరోనా నియంత్రించడానికి మాస్కులు 99 శాతం దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాల‌ని సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో 80 వేల‌ మాస్కులు విక్రయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, వైస్‌ ...

Read More »

రెండు ల‌క్షల విలువగల‌ పిపిఇ కిట్ల వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాలంటరీ అసోసియేషన్‌ దిల్లీ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో పొటెన్షియల్‌ కిట్లను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. రెండు ల‌క్షల విలువైన కిట్లను వాలంటరీ అసోసియేషన్‌ వారు వితరణ చేయడం అభినందనీయమని కొనియాడారు. కామారెడ్డి జిల్లాలో కరోనా కట్టడికి వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, జిల్లాస్థాయి అధికారులు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, వైస్‌ చైర్‌ పర్సన్‌ హిందూ ...

Read More »

13 వేల‌ టన్నుల‌ ధాన్యం కొనుగోలు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రంలో 13 వేల‌ టన్నుల‌ దాన్యం కొనుగోలు చేయాల‌ని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం మిల్ల‌ర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించి ధాన్యం కొనుగోలు ముమ్మరంగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు పక్కన ధాన్యం కుప్పలు ఉంటే అక్కడే కొనుగోలు చేపట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. రైతులు భౌతిక దూరం పాటించాల‌ని ...

Read More »

వల‌స కార్మికుల‌కు మజ్జిగ పంపిణీ చేసిన పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ మూలంగా కాలినడకన‌ తమ స్వస్థలాల‌కు వెళ్తున్న వల‌సకూలీల‌కు, ప్రజల‌ భద్రత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసు, రెవెన్యూ సిబ్బందికి పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఆర్మూర్‌ నుండి జాతీయ రహదారి మీదుగా బాల్కొండ ముప్కాల్‌ పోచంపాడ్‌ చెక్‌ పోస్ట్‌ వరకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతు లాక్‌ డౌన్ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలు, వల‌సకూలీల‌కు ...

Read More »

ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం మహర్షి భగీరథ వేడుకలు జరిపారు. భగీరథ చిత్రపటానికి కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రaాన్సీ రాణి, అధికారులు పాల్గొన్నారు.

Read More »

రిటైర్డ్‌ ఉపాధ్యాయునికి సన్మానం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డిపేట్‌ మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల‌యంలో నాగిరెడ్డిపేట ప్రాథమిక ఉన్నత పాఠశాల‌లో విధులు నిర్వహించినటువంటి గోపాల్‌ రెడ్డికి జెడ్పిటిసి మనోహర్‌ రెడ్డి, ఎంపీపీ రాజు దాస్‌, ఎంపీడీవో శ్యామల‌ ఆధ్వర్యంలో పూల‌మాల‌లు వేసి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిులు తినిపించారు. అనంతరం ఉపాధ్యాయుడుగా గోపాల్‌రెడ్డి చేసిన సేవల‌ను కొనియాడారు. 1983లో ఉపాధ్యాయ వృత్తికి వచ్చి 2020 లో పదవీ విరమణ పొందడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల‌ పిఆర్‌టియు అధ్యక్షుడు చంద్రమోహన్‌, ఉపాధ్యాయులు తదితరులు ...

Read More »

ప్రభుత్వ కార్యాల‌యాల్లో మాస్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ కార్యాల‌యాల‌లో, ప్రజల‌కు వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 500 శానిటైజర్ బాటిల్లు, మాస్కులు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉషా గౌడ్‌, వైస్‌ ఎంపీపీ నర్సింలు, సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు జనార్దన్‌ రెడ్డి, బాల‌రాజ్‌ గౌడ్‌, పరందాములు, విద్యాసాగర్‌, తిరుపతి, పోచయ్య, గోవింద్‌, ఆఫీజ్‌, ప్యాలాల రాము, సురేందర్‌, కాశిరం, యూనిస్‌ పాల్గొన్నారు.

Read More »

కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని బీర్కూర్‌ మండలం దామరంచ వద్ద గురువారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడిరది. ప్రమాదం నుంచి డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు.

Read More »

ఘనంగా మహాముని భగీరథ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా ముని భగీరథుని జయంతి సందర్భంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో గురువారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పాల్గొని మహా ముని భగీరథుడు చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి పూల మాల‌లు వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు ల‌తా, బి చంద్రశేఖర్‌, ఏవో సుదర్శన్‌, బిసి సంక్షేమ అధికారి బి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వృద్ధాశ్రమంలో మందులు, పండ్లు పంపిణీ చేసిన న్యాయమూర్తి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్తయ్య ఆధ్వర్యంలో వృద్దాశ్రమాన్ని సందర్శించి వారికి పిహెచ్‌సి వారి సహకారం తో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో బార్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు ల‌క్ష్మణ్‌ రావు, ప్రధాన కార్యదర్శి సురేందర్‌ రెడ్డి, న్యాయవాదులు దామోదర్‌ రెడ్డి, శ్యామగోపాల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సలీం, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబెర్‌ మధుసూదన్‌ రెడ్డి ...

Read More »

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 శానీటైజర్లు, 1000 మాస్కుల‌ను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డికి గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు. జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ రామ్మోహన్‌రావు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు డి విజయ నందరావు, జిల్లా కమిటీ అధ్యక్షుడు కె నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేద సంస్కృతిలో ఎంగిలి దోషం…

మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాల‌లో ఒకటి ‘ఎంగిలి దోషం’ అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వల‌న సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి ...

Read More »

జేసిఐ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ వ‌ల్ల వల‌స కూలీల‌తో పాటు అనేక మంది పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన జేసిఐ ఇందూర్‌ సంస్థ ప్రతినిధులు వారికి గురువారం సహాయం చేశారు. లాక్‌ డౌన్ వ‌ల్ల‌ పని లేక ఇబ్బందుల పాల‌వుతున్న నిరుపేదల‌కు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. కోటగల్లి, వినాయక నగర్‌, సీతారాం నగర్‌, దుబ్బ, కంఠేశ్వర్‌ ప్రాంతాల్లో పేదల‌ను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ ...

Read More »

245 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 245 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 236, ఆటోలు 6, ఫోర్ వీల‌ర్స్‌ 3 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

బీడీ కార్మికుల‌ను ఆదుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా ప్రపంచవ్యాప్తంగా విజృంభించి ప్రజ జీవితాన్ని అతలా కుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న సందర్భంగా లాక్‌ డౌన్‌ విధించారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుంచి మే 7వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ విధించాయి. దీంతో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రెండు ల‌క్షల‌ 50 వేల‌ మంది, తెంగాణ రాష్ట్రంలో 7 ల‌క్షల‌ మంది బీడీ కార్మికుల‌కు ...

Read More »

ఐదుగురు డిశ్చార్జ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఐదుగురు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ చేయబడ్డారని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం 41 మంది డిశ్చార్జి చేయబడ్డారని మరో 20 మంది కోలుకోవాల్సి ఉందని కలెక్టర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Read More »