Breaking News

క్వారంటైన్‌ సెంటర్ల తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌, డిచ్‌పల్లిలో గల‌ ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వారితో మాట్లాడారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాహసిల్దార్‌కు లేదా నేరుగా తనకు తెలియచేయాల‌న్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారితో ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు ఇంటి దగ్గర కన్నా చాలా బాగున్నవి అని తెలియజేశారు.

14 రోజులు పూర్తయిన వారిని వైద్యపరీక్షల‌ అనంతరం కరోనా ల‌క్షణాలు లేని వారిని డిశ్చార్జి చేయాల‌ని అధికారుల‌కు తెలిపారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరో ఏడురోజులు హోమ్‌ క్వారంటైన్‌ పాటించాల‌ని, కుటుంబ సభ్యులు బాగుండాల‌నే ఉద్దేశంతోనేనని తెలిపారు. మాక్లూర్‌ నర్సింగ్‌ కాలేజ్‌లో 48 మంది, ఆర్మూర్‌ టిఎస్‌ మోడల్‌ స్కూల్‌లో 15 మంది ఉన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ రోజూ రెండుసార్లు చెక్‌ చేయాల‌ని ఆదేశించారు.

శానిటేషన్‌ సిబ్బంది పరిసరాలు నీట్‌గా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అందరు సామాజిక దూరం పాటించాల‌న్నారు. కలెక్టర్‌ వెంబడి డిచ్‌పల్లి సర్పంచ్‌ రాధాకృష్ణారెడ్డి, మాక్లూర్‌ తహసిల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీవో చక్రి నాయక్‌, డిచ్‌పల్లి తహసిల్దార్‌ వేణు, ఎంపీడీవో సురేందర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ తదితరులున్నారు. అంతకుముందు నిజామాబాద్‌ పట్టణంలో ఖిల్లా, అహ్మద్‌ పురా కాల‌నీలో సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.

సర్వే జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి చెందారు. కలెక్టర్‌ వెంబడి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఉన్నారు. ఐసొలోషషన్‌ సెంటర్‌ కొరకు తిరుమల‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు. గురువారంలోగా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాట్లు పూర్తిచేయాల‌ని టిఎస్‌ ఎంఐడిసి ఈఈ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. మొత్తం 56 గదులు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. కలెక్టర్‌ వెంబడి డాక్టర్‌ ప్రతిమా మహారాజ్‌, హాస్పిటల్‌ యజమాని పరమేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *